Arjun Suravaram
Telangana DSC: తెలంగాణలో డిఎస్సీ పరీక్షలు రాసిన వారికి కీలక అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర విద్యా శాఖ నుంచి ముఖ్య అప్ డేట్ వచ్చిన నట్లు తెలుస్తోంది. ఇటీవలే డిఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసింది.
Telangana DSC: తెలంగాణలో డిఎస్సీ పరీక్షలు రాసిన వారికి కీలక అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర విద్యా శాఖ నుంచి ముఖ్య అప్ డేట్ వచ్చిన నట్లు తెలుస్తోంది. ఇటీవలే డిఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసింది.
Arjun Suravaram
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల విషయంలో వేగవంతంగా చర్యలు తీసుకుంటుంది. నోటిఫికేషన్ ఇచ్చింది మొదలు భర్తీ చేసేందుకు వీలైనంత త్వరగా ప్రక్రియలను పూర్తి చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 2 విషయంలో పరీక్ష షెడ్యూలు విడుదల చేసిన సంగతి తెలిసింది. అలానే గతంలో డిఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో డిఎస్సీ పరీక్షలు రాసిన వారికి ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించి ఇటీవలే ప్రిలిమినరీ ఆన్సర్ కీ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా తుది కీ ను, ఫలితాలను విడుదల చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా కొత్త టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఉందని, అందుకే అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ చేపట్టి.. తుది కీ సిద్దం చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తుది కీ మంగళవారం అనగా సెప్టెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారని సమాచారం. అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టు ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ నెల తొలి వారంలోనే ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తోందని పలువురు చెబుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో జిల్లాల వారీగా మెరిట్ లిస్టును వెల్లడి చేయనున్నారని సమాచారం.
డిఎస్సీ 2024 ఫలితాలు విడుదల చేసిన తరువాత ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారని, ఆ వెంటనే నియామక పత్రాలు ఇవ్వనున్నారని సమాచారం. ఇదంతా కూడా అతి త్వరలో పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. అన్ని సక్రమంగా జరిగితే అతి త్వరలో డిఎస్సీ 2024 ప్రక్రియ పూర్తి కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదిమొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో 2,629 ఎస్ఏ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు ప్రత్యేక విద్యకు 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డిఎస్సీ పరీక్షలకు 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరి..ప్రభుత్వం నుంచి ఇలాంటి అప్ డేట్ వచ్చిందనే సమాచారం డిఎస్సీ రాసిన వారు ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.