P Krishna
Holiday Cancel 2024: మూడు రోజులు వరుస సెలవులు రావడంతో అందరూ సంతోషంలో మునిగిపోయారు. కానీ ప్రభుత్వం అంతలోనే షాక్ ఇస్తూ.. సెలవులు క్యాన్సల్ చేయడంతో అందరూ నిరుత్సహాంలో మునిగిపోయారు.
Holiday Cancel 2024: మూడు రోజులు వరుస సెలవులు రావడంతో అందరూ సంతోషంలో మునిగిపోయారు. కానీ ప్రభుత్వం అంతలోనే షాక్ ఇస్తూ.. సెలవులు క్యాన్సల్ చేయడంతో అందరూ నిరుత్సహాంలో మునిగిపోయారు.
P Krishna
సాధారణంగా ఎవరికైనా సెలవులు ఉంటే ఆ రోజు ఎంతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసేవారికి సెలవులు దొరికితే చాలు ఎంతో ఆనందపడతారు. ఆ రోజు ఎన్నో రకాల ప్లానింగ్స్ వేసుకుంటారు. తెలంగాణలో మూడు రోజుల అంటే మార్చి 8,9,10 వరకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో అందరూ తెగ ఖుషీలో మునిగిపోయారు. అయితే మూడు రోజుల ప్రకటించిన సెలవులను రద్దు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. మూడు రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం హఠాత్తుగా నిర్ణయం ఎందుకు మార్చుకుందీ? దీనికి గల కారణం ఎంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మూడు రోజుల సెలవులు రద్దు చేసింది. 8న శివరాత్రి, 9న రెండో శనివారం, 10 న ఆదివారం. ఇలా వరుసగా మూడు రోజులు పాటు సెలవులు వచ్చాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేయాలని ఎమ్మార్వో, సూపరింటెండెంట్, కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ప్రారంభోత్సవాలు ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే స్కూల్స్, కాలేజీలకు మాత్రం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉంటాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పలు అభివృద్ది పథకాల అమలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ పాతబస్తీ మెట్రోకు ఫరూక్నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన చేశారు. రాబోయే రెండు రోజుల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో అన్ని పార్టీ నేతలు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల పేర్లు ప్రకటించగా.. అందులో తెలంగాణ నుంచి నలుగురు పేర్లు వెల్లడించింది.