iDreamPost
android-app
ios-app

CM రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అక్కడ రిజిస్ట్రేషన్లకు బ్రేక్!

  • Published Oct 11, 2024 | 5:35 PM Updated Updated Oct 11, 2024 | 5:35 PM

CM Revanth Reddy: గత ఏడాది తెలంగాణలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పరిపాలనా విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు.

CM Revanth Reddy: గత ఏడాది తెలంగాణలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పరిపాలనా విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు.

CM రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అక్కడ రిజిస్ట్రేషన్లకు బ్రేక్!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ నెరవేర్చుతూ వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎవరి నోట విన్నా ‘హైడ్రా’ పేరే వినిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వాటినికి ‘హైడ్రా’ ఆధ్వర్యంలో కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, కోర్టులో కేసులు వేసినా హైడ్రా తన పని చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

HMDA పరిధిలోని గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. ఇకపై హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో లేఔట్ల రిజిస్ట్రేషన్లు చేయవొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వం కొత్తగా కొన్ని గ్రామాలను చేర్చింది. అప్పటికే పలు గ్రామాల్లో ఫామ్ హౌస్‌లకు గ్రామ పంచాయితీ అనుమతులు ఇచ్చాయి. జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లకు గ్రామ పంచాయతీలు అనుమతి ఇవ్వడం జరిగింది. హైడ్రా తెరపైకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయితీల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీల్లో (GP) లేఔట్ల రిజిస్ట్రేషన్స్ నిలిపి వేశారు. ప్రస్తతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది.

ఈ మేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ (HMDA) రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని అధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేదిత జాబితా 22 – ఏ (1)(E) కిందకు బదలాయించింది. ఇదిలా ఉంటే భవిష్యత్ లో ఎప్పటికైనా ఉపయోగపడాయని కొనుగోలు చేసిన ఫ్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు పరిస్తితి మింగలేక, కక్కలేక అన్న చందంగా తయారైంది. ఆడ పిల్ల పెళ్లి, అబ్బాయి ఉన్నత చదువులకు పనికి వస్తుందని భావించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలో జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ఫ్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డు కట్ట వేశారు. ఫలితాంగా అప్పటికే స్థలాలు కొనుగోలు చేసిన వారు అమ్మలేని పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రారు.. దీంతో కొన్న ఫ్లాట్లు దేనికి పనికిరాకుండా పోతున్నాయని స్థలాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.