తెలివి, అవగాహన లేదు.. CM రేవంత్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన KCR

KCR Comments on Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్దం మొదలైంది.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు.

KCR Comments on Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్దం మొదలైంది.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తర్వాత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ని పక్కన బెట్టి కాంగ్రెస్ కి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌజ్ లో ప్రమాదానికి గురై ఆపరేషన్ చేయించుకొని ఇంటి పట్టునే రెస్టు తీసుకున్నారు. దాదాపు రెండు నెలలుగా ఆయన పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. తొలిసారిగా తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్.. కేఆర్ఎంబీకి నీటి ప్రాజెక్టుల అప్పగింతపై సీఎం రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో స్పందించారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు నెలల పాటు తన ఇంట్లో రెస్టు తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 2న అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా తెలంగాణ భవన్ చేరుకొని.. పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్ అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నడుస్తున్న వివాదంపై తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ కి తెలివిలేదని.. రేవంత్ రెడ్డికి అసలు ప్రాజెక్టుల మీద ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. గత ప్రభుత్వంపై చేసిన ప్రాజెక్టుల పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై క్లారిటీ ఇచ్చేందుకు ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓపెన్ ఛాలెంజ్ విసిరిసిన సంగతి తెలిసిందే.

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి కి అసలు ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేదు, ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే పరిణామాల గురించి తెలుసుకోలేపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పాటుపడింది.. కేఆర్ఎంబీ పరిధిలో ప్రాజెక్టులు వేళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి చేస్తుందో.. తెలియక చేస్తుందో.. అవగాహన లేకుండా చేస్తుందో అర్థం కావడం లేదు. ఇదే గనక జరిగితే.. ఏ డ్యామ్ కైనా సున్నం వేయాలన్నా బోర్డు పరిమిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. బీఆర్ఎస్ కి పోరాటాలు కొత్త కాదు.. భవిష్యత్ లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా పోరాటం చేసి ఆపుతాం. నల్లగొండ జిల్లలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తాం. ప్రజా క్షేత్రంలోనే కాంగ్రెస్ వైఖరిని ఎండగడతాం.. ప్రజా ఉద్యమంతో హక్కులను కాపాడుతాం’అని అన్నారు కేసీఆర్.

Show comments