iDreamPost
android-app
ios-app

Karimnagar: అనారోగ్యం వేధిస్తున్నా పట్టు వదల్లేదు.. కట్‌ చేస్తే 6 ప్రభుత్వ ఉద్యోగాలు

  • Published Jul 31, 2024 | 1:29 PM Updated Updated Jul 31, 2024 | 1:29 PM

Karimnagar-Akshita Got 6 Govt Jobs: తల్లిదండ్రుల నుంచి కాస్త ప్రోత్సాహం అందిస్తే ఆడపిల్లలు చరిత్ర సృష్టిస్తారని నిరూపించింది ఓ యువతి. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఆ వివరాలు..

Karimnagar-Akshita Got 6 Govt Jobs: తల్లిదండ్రుల నుంచి కాస్త ప్రోత్సాహం అందిస్తే ఆడపిల్లలు చరిత్ర సృష్టిస్తారని నిరూపించింది ఓ యువతి. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఆ వివరాలు..

  • Published Jul 31, 2024 | 1:29 PMUpdated Jul 31, 2024 | 1:29 PM
Karimnagar: అనారోగ్యం వేధిస్తున్నా పట్టు వదల్లేదు.. కట్‌ చేస్తే 6 ప్రభుత్వ ఉద్యోగాలు

ఆడపిల్లలు పుడితే ఆర్థిక భారం తప్ప వారి వల్ల అదనపు ప్రయోజనం ఉండదని భావించే తల్లిదండ్రులు నేటికి కూడా మన సమాజంలో ఎందరో ఉన్నారు. కానీ ఆ ఆలోచనను పక్కకు పెట్టి.. వారికి కాస్త ప్రోత్సాహం ఇస్తే.. ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తారో తాజాగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మను బాకర్‌ని చూస్తే అర్థం అవుతుంది. ఆడపిల్లను కంటే ఆస్తులు కూడబెట్టి ఇవ్వల్సిన పని లేదు. వారికి కాస్త భరోసా, నమ్మకం, నచ్చిన రంగంలో రాణించేందుకు అవకాశం ఇస్తే సరిపోతుంది. ఆ మాత్రం చిన్న ప్రోత్సాహానికే వారు అద్భుతాలు సృష్టిస్తారు. అందుకు ఉదహారణగా నిలిచిన ఓ యువతి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. తల్లిదండ్రులు వ్యవసాయ చేస్తుంటారు. అయినా సరే.. కుమార్తెను బాగా చదవించాలని భావించారు.. ఆదిశగా ప్రోత్సాహించారు. తల్లిదండ్రులు ఆమె మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అనారోగ్య సమస్య వేధిస్తున్న అరుదైన ఘనత సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆ యువతి. ఆ వివరాలు..

కరీంగనర్‌ యువతి అక్షిత ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుదామనుకున్న ఆ యువతి.. అనారోగ్య కారణాల వల్ల.. దాన్ని పక్కకు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నోటీఫికేషన్ల మీద దృష్టి సారించింది. పట్టుదలగా చదివి 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఆమెనే కరీంనగర్‌ జిల్లాకు చెందిన అక్షిత. గోపాలరావు పేటకు చెందిన కిషన్‌ రెడ్డి, అరుణలు వ్యవసాయం పనులు చేసుకుంటూ కుటంబాన్ని పోషించేవారు. వీరిది రైతు కుటుంబం. ఇక వీరి కుమార్తె అక్షితకు చదువంటే చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం. కుమార్తె ప్రతిభను గుర్తించిన ఆ తల్లిదండ్రుల.. ప్రభుత్వ ఉద్యోగం సాధించేవరకు ఆమెని ప్రోత్సాహించారు.

చదువులో చురుగ్గా ఉండే అక్షిత.. చిన్నప్పుడు సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వాలనుకుంది. కానీ అనారోగ్య సమస్యలతో దిశను మార్చుకుంది. పది, ఇంటర్‌లో టాప్‌ మార్కులు సాధించింది. డిగ్రా పూర్తి చేసిన తర్వాత.. సోదరుడి ప్రోత్సాహంతో.. ఇంగ్లీష్‌ లిటరేచర్‌ను ఎంచుకుంది. ఫస్టియర్‌ పూర్తయ్యేలోపే నెట్‌, సెట్‌ పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యింది. బీఎడ్‌ పూర్తి చేసింది. ఇప్పుడు పీహెచ్‌డీ సెకండియర్‌ చదువుతోంది. ఓవైపు చదువుకుంటూనే.. స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తుంది. ఈ క్రమంలో గురుకుల నోటిఫికేషన్‌ రావడంతో.. ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యింది.

చదువే లోకంగా బతికే అక్షిత.. గురుకుల పీజీటీ, టీజీటీ, జేఎల్‌, డీఎల్‌ సహా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తాను రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్‌ అవుతున్నానని.. కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదివితే ఈ ఫలితం దక్కింది అని చెప్పుకొచ్చింది. తన మీద తాను నమ్మకం పెట్టుకుని.. ఆ దిశగా ముందుకు వెళ్లానని.. సోషల్‌ మీడియా, సినిమాలు వంటి వాటి వల్ల తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.

చుట్టుపక్కల వాళ్లు.. తన పెళ్లి గురించి అడిగినా.. తన తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వం ఉద్యోగం సాధించే వరకు పెళ్లి చేయమని చెప్పారని.. చదువు విషయంలో తనకు ప్రతి విషయంలో తన తల్లిదండ్రులు తనకు ఎంతో అండగా నిలబడ్డారని.. తల్లిదండ్రుల వల్లే తాను ఈ విజయం సాధించాను అని చెప్పుకొచ్చింది. ఇక అక్షిత సాధించిన విజయంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.