Karimnagar News: హాలీవుడ్ లో తెలంగాణ కుర్రాడి సత్తా.. ట్రైలర్ తోనే 28 అవార్డులు!

Karimnagar News: ఎంతో మంది యువత సినిమాల్లో తమ లక్ ను పరీక్షించుకుంటారు. చాలా మంది అవకాశాలు దొరక్క జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ కష్టాలు పడుతున్నారు. మరికొందరు మాత్రం అవకాశాలు దొరికినా లైమ్ లైట్‌ లోకి రాలేక ఇబ్బందులు పడుతున్నారు.

Karimnagar News: ఎంతో మంది యువత సినిమాల్లో తమ లక్ ను పరీక్షించుకుంటారు. చాలా మంది అవకాశాలు దొరక్క జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ కష్టాలు పడుతున్నారు. మరికొందరు మాత్రం అవకాశాలు దొరికినా లైమ్ లైట్‌ లోకి రాలేక ఇబ్బందులు పడుతున్నారు.

చాలా మందికి సినిమా అంటే ఒక ఎంటర్ టైన్మెంట్ మాత్రమే. కానీ కొందరికి మాత్రం అదొక ఎమోషనల్. కేవలం సినిమా కోసం తమ జీవితాన్ని దారపోస్తుంటారు. అదే తమ ఊపిరిగా జీవితంలో ముందుకు సాగుతుంటారు. ఎంతో మంది యువత సినిమాల్లో తమ లక్ ను పరీక్షించుకుంటారు. చాలా మంది అవకాశాలు దొరక్క జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ కష్టాలు పడుతున్నారు. మరికొందరు మాత్రం అవకాశాలు దొరికినా లైమ్ లైట్‌ లోకి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కష్టానికి ఆవగింజ అంత అదృష్టం తోడైతేనే విజయం సాధించవచ్చు. అలానే ఓ తెలంగాణ కుర్రాడు..తన కష్టంతో సినిమా రంగంలో తన సత్తాను చాటాడు. అయితే టాలీవుడ్‌లోనో.. అటు బాలీవుడ్‌లోనో కాదు.. ఏకంగా హాలీవుడ్‌ లోనే జెండా పాతేస్తున్నాడు. కేవలం ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు ఈ తెలుగు కుర్రాడు. మరి..అతడి స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ పట్టణంలోని భగత్‌నగర్‌ కు చెందిన గుండ వెంకట్‌సాయి హాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు. అతడికి చిన్నతనం నుంచి సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి ఉండేది. ఆయన పేరెంట్స్.. గుండ సునీత, శ్రీనివాస్‌ కూడా వెంకట్ సాయిని ప్రోత్సహించారు. సాయి ఎప్పటికైనా సినిమాలు తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంతకంటే ముందు చదువులో రాణించాలని భావించి..అలానే అడుగులు వేశాడు. చివరకు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించాడు. ముందుగా ఎంఎస్ కోసం 11 ఏళ్ల కిందట వెంకట సాయి ఆమెరికాకు వెళ్లాడు. చదువు తర్వాత అక్కడే ఉద్యోగం తెచ్చుకున్నాడు. ప్రత్యూష అనే అమ్మాయిని వివాహం చేసుకుని న్యూజెర్సీలోనే స్థిరపడ్డాడు.

ఇక సాయికి అమెరికాలో ఆరంకెల శాలరీ వస్తున్నప్పటికీ ఫొటోగ్రఫీ, యాక్టింగ్‌ను మాత్రం ఎక్కడా వదల్లేదు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే..మరో వైపు తన ప్యాషన్ అయిన నటనలో సత్తా చాటుతున్నాడు. ఎప్పటికైనా హాలీవుడ్‌లో సినిమా తీసి.. తెలుగోడి సత్తా చాటాలన్న లక్ష్యంతో వెంకట సాయి కష్టపడ్డాడు. అటు ఉద్యోగం చేస్తూనే.. సమయం దొరికినప్పడల్లా “వద్దంటే వస్తావే ప్రేమ” పేరుతో ఓ వెబ్‌ సిరీస్ తీశాడు.  10 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తీసి.. ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ వెబ్ సిరీస్‌కు ఉత్తమ ఫొటోగ్రాఫర్‌ గా అవార్డును కూడా గెల్చుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఇచ్చిన విశ్వాసంతో వెంకట సాయి “ది డిజర్వింగ్” అనే సినిమాను తీశాడు. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.

స్టోరీకి తగ్గట్టుగా ఉండే అమెరికన్ నటీనటులను ఆడిషన్స్‌ నిర్వహించి సెలెక్ట్ చేసుకున్నాడు. గంట 17 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాను కేవలం 14 రోజుల్లోనే తీయటం మరో స్పెషాలిటీ. ఈ సినిమా ట్రైలర్ 28 ఇంటర్నేషనల్ అవార్డులను గెల్చింది. ఈ సినిమా అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో విడుదల కానుందని తెలిపాడు. కథ రాయటం నుంచి సినిమా పూర్తయ్యే వరకు సుమారు ఐదేళ్ల పాటు చాలా కష్టపడ్డానని సాయి తెలిపాడు. తన కొడుక్కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చని, ఎక్కువగా ఇంగ్లీష్‌ సినిమాలో చూసేవాడని తల్లిదండ్రులు చెప్తున్నారు. అమెరికా వెళ్తానంటే పంపించామని… అక్కడ ఉద్యోగం చేస్తూనే ప్రపంచం గుర్తించే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదని తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. వెంకట సాయి స్నేహితులు, బంధువులు అతడి  పలు అవార్డులు గెలవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి..హాలీవుడ్ లో సత్తా చాటిన తెలంగాణ కుర్రాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments