Dharani
Kandi Pappu Prices Increased: నిన్నటి వరకు కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే.. ఇప్పుడు ఆ జాబితాలోకి కంది పప్పు చేరింది. కేజీ ధర ఏకంగా డబుల్ సెంచరీ దాటి పరుగులు తీస్తోంది. ఆ వివరాలు..
Kandi Pappu Prices Increased: నిన్నటి వరకు కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే.. ఇప్పుడు ఆ జాబితాలోకి కంది పప్పు చేరింది. కేజీ ధర ఏకంగా డబుల్ సెంచరీ దాటి పరుగులు తీస్తోంది. ఆ వివరాలు..
Dharani
నిత్యవసర సరుకుల ధరలు, ఇంధన ధరలు ఇలా సామాన్యుల నెత్తిన ఎన్నో భారాలున్నాయి. వచ్చే బెత్తెడు ఆదాయానికి.. మూరేడు ఖర్చులు ఎదురు చూస్తుంటాయి. ఇక న్నిన్నటి వరకు కూరగాయల ధరలు సామాన్యులకు గాయం చేశాయి. ఏ కూరగాయ ముట్టుకున్న కేజీ ధర వంద రూపాయలు, ఆపై పలికింది. ఇక టమాటా, ఉల్లి రేట్లు కొన్ని రోజుల పాటు దూసుకుపోయాయి. సెంచరీ దిశగా సాగాయి. గత కొన్ని రోజులుగా ఈ రెండింటి రేట్లు దిగి వస్తున్నాయి. దాంతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకుందామనే లోపల.. నేనున్నాను అంటూ భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది కంది పప్పు. కూరగాయల ధరలు దిగి వస్తున్నాయి అనుకునేలోపే కంది పప్పు ధర కొండెక్కి కూర్చుని.. సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఆ వివరాలు..
పప్పు లేని భోజనం చాలా వరకు ఉండదు. ప్రతి ఇంట్లో కనీసం వారానికి రెండు, మూడు సార్లైనా పప్పు వండాల్సిందే. సాంబార్, పప్పు చారు, ఆకు కూర కాంబినేషన్ ఇలా ఏదో విధంగా పప్పు ఉడకాల్సిందే. ఇక మార్కెట్‌లో నిన్నమొన్నటి వరకు కిలో కంది పప్పు ధర రూ.140-160 మంధ్య ఉండగా.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి.. ఏకంగా 200 రూపాయలకు చేరువయ్యింది. ప్రస్తుతం కిలో కంది పప్పు ధర రూ. 180-200 వరకు విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో క్వాలిటీని బట్టి కేజీ రూ. 220-240 వరకు కూడా ధర పలుకుతోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పుతో పాటు మిగతా పప్పుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ పెసరపప్పు గత నెల క్రితం రూ. 100 ఉండగా.. ప్రస్తుతం రూ. 120కి చేరింది. మినప్పప్పు రేటు కూడా దూసుకుపోతుంది. ఇక ఉల్లి ధరలు కూడా మరోసారి ఘాటెక్కాయి. రెండు, మూడు నెలల క్రితం వరకు కూడా కేజీ ఉల్లి రూ. 25కు లభించగా.. ప్రస్తుతం రూ. 50కి చేరింది. వారం క్రితం వరకు కూడా చిరు వ్యాపారులు రూ.100కు నాలుగు కేజీల చొప్పున విక్రయించగా.. ప్రస్తుతం రూ.100 రెండు, రెండున్న కేజీలు మాత్రమే ఇస్తున్నారు. గతేడాది వర్షాభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల ఉత్పత్తి 40 శాతం వరకు తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. అందువల్లే ధరలు విపరీతంగా పెరిగాయని చెబుతున్నారు.
ఇక ఆదివారం వస్తే.. కచ్చితంగా ముక్క ఉండాల్సిందే. మిగతా రోజుల సంగతి పక్కకు పెడితే.. కనీసం సండే నాడు అయినా చికెన్, మటన్ తినాలకున్న నాన్ వెజ్ ప్రియులకు.. మాంసం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మన దగ్గర చికెన్ రేటు దిగి రావటం లేదు. ప్రస్తుతం కేజీ చికెన్ రూ. 270- 300 మధ్య పలుకుతోంది. ఇక మటన్ విషయానికొస్తే కేజీ రూ. 800 నుంచి రూ. 1000 మధ్య పలుకుతోంది. దీంతో సండే పూట ముక్కతో విందు భోజనం చేసుకుందామని అనుకున్న నాన్‌వెజ్ ప్రియులకు నిరాశే ఎదురవుతోంది. భారీగా పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. మరి ధరలు ఎన్నటికి దిగి వస్తాయో చూడాలి అంటున్నారు.