Dharani
రాత్రి కుటుంబ సభ్యలతో కలిసి సంతోషంగా భోంచేసి పడుకుంది ఆ యువతి. తెల్లారేసరికి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..
రాత్రి కుటుంబ సభ్యలతో కలిసి సంతోషంగా భోంచేసి పడుకుంది ఆ యువతి. తెల్లారేసరికి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..
Dharani
ఈమధ్యకాలంలో సమాజంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటి మూలాలు ఆరా తీస్తే.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసంగతి అలా ఉంచితే.. ఈమధ్యకాలంలో ఇంటి నుంచి వెళ్లిపోతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. కుటుంబ కలహాల వల్ల కొందరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరి కొందరు మాత్రం.. ఎలాంటి కారణం లేకుండానే ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఇక కొందరు వివాహిత మహిళల తమతో పాటు పిల్లలను కూడా తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. అసలు వారు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో.. ఎక్కడకు వెళ్తున్నారో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రాత్రి భోంచేసి పడుకున్న కుటుంబ సభ్యులకు తెల్లారేసరికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆవివరాలు..
కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట్ మండలం, బొల్లారం గ్రామానికి చెందని అనిత అనే యువతి అనుమానాస్పద రీతిలో అదృశ్యమైంది. ఈ సంఘటన గ్రామంలో కలకలంరేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బొల్లారం గ్రామానికి చెందిన మన్నే అనిత(24) అనే యువతి తల్లిదండ్రలతో కలిసి ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా శనివారం నాడు రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోంచేసి.. పడుకుంది. మరి ఏం జరిగిందో తెలియదు.. పొద్దున అనిత కుటుంబ సభ్యులు నిద్ర లేచి చూసే సరికి ఆమె ఇంట్లో కనిపించలేదు.
దాంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు అనిత కోసం చుట్టుపక్కల గాలించారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బొల్లారం గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడిపై తమకు అనుమానం ఉందని తెలిపారు అనిత కుటుంబ సభ్యులు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిత ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ప్రేమ వ్యవహారం అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.
ఇక నెల రోజుల క్రితం నేపాల్ నుంచి హైదరాబాద్ వచ్చిన వివాహిత భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె పుట్టింటికి వెళ్లి ఉంటుందని భావించిన భర్త.. వారికి కాల్ చేయగా.. ఆమె అక్కడికి రాలేదని తెలిపారు. దాంతో అతడు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి అదృశ్యమవుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. వీటిల్లో చాలా కేసులు అలానే ఉండిపోతున్నాయి అని తెలుస్తోంది.