కాకతీయ యూనివర్సిటీ బాలికల హాస్టల్లో కుప్పకూలిన స్లాబ్..విద్యార్థుల ఆందోళన

వీడియో: కాకతీయ యూనివర్సిటీ బాలికల హాస్టల్లో కుప్పకూలిన స్లాబ్..విద్యార్థుల ఆందోళన

హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాలో ఎంతో గొప్ప పేరు ఉంది. ఈ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నతమైన పొజీషన్లో ఉన్నారు.

హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాలో ఎంతో గొప్ప పేరు ఉంది. ఈ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నతమైన పొజీషన్లో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ యూనివర్సిటీకి ఎంతో గొప్ప పేరు ఉంది. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఉన్నతవిద్యనభ్యసించి గొప్ప పొజీషన్లో ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీపై ఇటీవల పలు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కాకతీయ యూనివర్సిటీ బాలికల పోతన బాలికల వసతీ గృహంలో స్లాబ్ కూలి పెచ్చులు ఊడి పడ్డాయి. అదృష్ఠ వశాత్తు ఆ సమయంలో హాస్టల్ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూమ్ లో ఉన్న సామాన్లు చెల్లాచెదురయి పాడయ్యాయి.హాస్టల్ గదిలో స్లాబ్ కూలిన ఘటనపై విద్యార్థినులు తీవ్రంగా స్పందించారు. తమకు హాస్టలో భద్రత కరువైందని..యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే..

హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేయూ పోతన బాలికల హాస్టల్ లో నిన్న రాత్రి స్లాబ్ కుప్పకూలిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఫ్యాన్ ఊడి కిందపడిన ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మరువక ముందే రూమ్ లోని స్లాబ్ కూలి పెచ్చులు పడిపోయాయి. ఈ ఘటనపై విద్యార్థినులు మాట్లాడుతూ.. తమ ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? మిమ్మల్ని నమ్మి మా తల్లిదండ్రులు పంపించారు.. మా ప్రాణలకు రక్షణ ఏదీ? ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా పెడ చెవిన పెడుతున్నారని కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల హాస్టల్ అమ్మాయిలు ఆందోళన చేశారు.

ఈ ఘటన తర్వాత కేయూలోని రాణి రుద్రమాదేవి హాస్టల్ ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రాన్ ని కొంతమంది అమ్మాయిలు అడ్డుకున్నారు. సమస్యలు తలెత్తినపుడే వస్తారా అంటూ రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ విద్యార్థినులు నినాదాలు చేశారు. కేయూ రిజిస్ట్రార్ తో విద్యార్థి నేతలు వాగ్వీవాదానికి దిగారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని చెప్పారు మల్లారెడ్డి.

Show comments