విద్యార్థులకు , ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జులై 17న సెలవు.. ఎందుకంటే..?

July 17th Holiday.. ఇప్పుడిప్పుడే స్కూల్స్ స్టార్ట్ అయ్యారు. కొత్త తరగుతులకు వెళ్లామన్న ఆనందంలో వున్నారు. అంతలో పాఠాలు మొదలయ్యాయి. మళ్లీ ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు స్టూడెంట్స్. అలాగే ప్రత్యేకమైన సెలవులు ఉన్నాయేమోనని చెక్ చేస్తున్నారు. వారికే కాదు ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్

July 17th Holiday.. ఇప్పుడిప్పుడే స్కూల్స్ స్టార్ట్ అయ్యారు. కొత్త తరగుతులకు వెళ్లామన్న ఆనందంలో వున్నారు. అంతలో పాఠాలు మొదలయ్యాయి. మళ్లీ ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు స్టూడెంట్స్. అలాగే ప్రత్యేకమైన సెలవులు ఉన్నాయేమోనని చెక్ చేస్తున్నారు. వారికే కాదు ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్

ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలైంది. జూన్ మిడిల్ నుండి విద్యార్థులు బడిబాట పట్టారు. కొత్త తరగతికి వెళ్లామన్న ఆనందంలో మునిగితేలుతున్నారు స్టూడెంట్స్. సమ్మర్ సెలవులు ఎలా ఆస్వాదించామో స్నేహితులకు చెప్పుకుని సంబరపడిపోయారు. కొత్త బుక్స్, డ్రెస్, బ్యాగులు చూసుకుని మురిసిపోతున్నారు. అంతలోనే పాఠాలు స్టార్ట్ కూడా చేశారు ఉపాధ్యాయులు. పుస్తకాలతో కుస్తీ పడటం మొదలైంది అనుకున్న సమయంలో బక్రీద్, మరికొన్ని సెలవులు వచ్చాయి. దీంతో హుర్రే అంటూ ఆనందంలో మునిగితేలారు విద్యార్థులు. మళ్లీ క్లాసులు మొదలు.  ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా మరో రోజు సెలవు వస్తే ఎంచక్కా ఆడుకోవచ్చునని ఆలోచన ఉంటుంది.

సెలవుల కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కు శుభవార్త. ఈ నెల 17న సెలవు రాబోతుంది. ఎందుకు అనుకుంటున్నారా.. ఆ రోజు మొహర్రం. ముస్లిం సోదరుల పండుగ. దీన్ని పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన పండుగను ఇరు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. కేవలం ముస్లిం సోదరులే కాకుండా.. అన్ని మతాలకు చెందిన వాళ్లు సైతం పాల్గొంటారు. పది రోజుల పాటు ఈ పండుగను చేస్తారు. మొహర్రం మాసంలో పదో రోజున పీర్ల దేవుళ్లను ఊరేగిస్తారు. హజరత్ ఇమాం హుసేన్‌ను స్మరించుకుంటూ పీర్ల దేవుళ్ల ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. అంతకు ముందు రాత్రి అగ్ని గుండంలో నడుస్తారు ముస్లిం సోదరులు. ఈ సమయంలో ఇస్లాం మతంలోని ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలను వివరిస్తారు.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జులై 17న సెలవు ప్రకటిచింది తెలంగాణ సర్కార్. కేవలం తెలంగాణలో కాదు ఏపీలో కూడా ఆ రోజు సెలవు దినం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు కూడా ఈ సెలవు వర్తించనుంది. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు హాలీడే ఉంటుంది. అలాగే ఈ నెలలో మరో సెలవు రానుంది. జూలై 27వ తేదీన కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు హాలీడే రానుంది. ఎందుకంటే ఆ రోజున బోనాలు పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలంగాణ పెద్ద పండగ‌ల‌లో బోనాలు ఒక‌టి. 2024 జూలై 7వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాలు స్టార్ట్ అవుతాయి. ఈ క్రమంలో రాష్ట్ర పండుగా జులై 27న సెలవు ప్రకటించారు. ఆ రోజు శనివారం కాగా, మరుసటి రోజు జులై 28 ఆదివారం వచ్చింది. ఈ లెక్కన రెండు రోజులు సెలువులు రానున్నాయి.

Show comments