iDreamPost
android-app
ios-app

వద్దన్నా వాడినే ప్రేమించిందన్న కోపంతో.. కూతురును కొట్టిచంపిన తల్లి

  • Published Mar 20, 2024 | 10:34 AM Updated Updated Mar 20, 2024 | 10:38 AM

ప్రేమ వ్యవహారాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. ఎన్ని సార్లు హెచ్చరించినా వద్దన్నా వాడినే ప్రేమించిందన్న కోపంతో కూతురును కొట్టిచంపింది కన్న తల్లి.

ప్రేమ వ్యవహారాలు దారుణాలకు దారి తీస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. ఎన్ని సార్లు హెచ్చరించినా వద్దన్నా వాడినే ప్రేమించిందన్న కోపంతో కూతురును కొట్టిచంపింది కన్న తల్లి.

  • Published Mar 20, 2024 | 10:34 AMUpdated Mar 20, 2024 | 10:38 AM
వద్దన్నా వాడినే ప్రేమించిందన్న కోపంతో.. కూతురును కొట్టిచంపిన తల్లి

ప్రేమించేటప్పుడు పెద్దోళ్లు గుర్తుకు రారు.. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినోడు గుర్తుకు రాడు. ఇది సినిమా డైలాగ్ అయినప్పటికీ కొన్ని ప్రేమ వ్యవహారాల్లో ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం ఇదే. ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడడం, ప్రేమించిన వాళ్లు దక్కకపోతో చంపడమో లేదా చావడమో చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో తల్లిదండ్రలకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడిపిస్తే వారి చేతుల్లోనే బలైపోతున్నారు. తమ కుటుంబ పరువు ఎక్కడ పోతుందోనని, సమాజంలో తమ గౌరవం దెబ్బతింటుందని భావించిన తల్లిదండ్రులు కడుపున పుట్టిన పిల్లలను సైతం చంపేందుకు వెనకాడటం లేదు. తాజాగా తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దండుమైలారంలో దారుణం జరిగింది. వద్దన్నా వాడినే ప్రేమించిందన్న కోపంతో కూతురును కొట్టి చంపింది తల్లి.

తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. కన్న కూతురు ప్రేమ వ్యవహారం నడుపుతోందని.. వద్దని వారించినా వినడం లేదని తల్లే కూతురును హతమార్చింది. తమకు ఇష్టం లేని వాడిని ప్రేమించిందన్న కోపంతో తల్లిదండ్రులు కూతురుపై పరువు హత్యకు పాల్పడ్డారని ఇబ్రహీం పట్నం సీఐ తెలిపారు. అసలు ఏ జరిగిందంటే.. దండుమైలారంలో నివాసముంటున్న మోతే జంగమ్మ, ఐలయ్యలకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు కాగా, ఒక కుమార్తె ఉంది. ఈమె దిల్ సుఖ్ నగర్‌లోని అనిబీసెంట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటుంది. ఈ క్రమంలో భార్గవి అదే గ్రామానికి చెందిన శశి అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం కాస్త భార్గవి తల్లిదండ్రులకు తెలిసింది.

దీంతో వారు ఆమెను మందలించి కాలేజీ మాన్పించారు. తమ పరువు కాపాడుకోవాలంటే కూతురుకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మరో అబ్బాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. అయినా భార్గవిలో మార్పు రాలేదు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తను ప్రేమించిన యువకుడిని ఇంటికి పిలిపించుకుంది భార్గవి. ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో భార్గవి తల్లి జంగమ్మ ఎంటర్ అయ్యింది. వారిపై కోపంతో రగిలిపోయింది.

ఎన్ని సార్లు చెప్పినా మారడం లేదని కూతురును కన్న తల్లే కొట్టి చంపింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ బాధితురాలి సోదరుడు చరణ్ తన తల్లే చంపిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు జంగమ్మపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. మరోవైపు మృతురాలి తండ్రి మాత్రం తమ కూతురును శశినే చంపాడని ఆరోపిస్తున్నారు. కన్న కూతురును తల్లి ఎందుకు చంపుకుంటుందని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş