Dharani
Dharani
పేదరికం.. మనిషి చేత ఎంతటి దారుణాలనైనా చేయించేదుకు పురి కొల్పుతుంది. కొన్ని రోజుల క్రితం ఓ తల్లి కుమారుడి కాలేజ్ ఫీజ్ చేల్లించేందుకు డబ్బులు లేక.. రన్నింగ్ బస్ ముందుకు దూకి.. ప్రాణత్యాగం చేసిన సంగతి తెలిసిందే. సాయం అడగాలంటే ఆత్మాభిమానం అడ్డువచ్చిందో.. లేక సాయం చేసే వాళ్లే కరువయ్యారనే స్థితికి వచ్చిందో తెలియదు కానీ.. కుమారుడిని చదివించడం కోసం తన ప్రాణాన్ని బలి చేసుకోవడం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో దేశం క్కసారి ఉలిక్కిపడింది. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది. కారణాలు తెలియవు కానీ.. ఓ మహిళ రన్నింగ్ బస్ కింద తలపెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత ఏం జరిగింది అంటే..
ఈ సంఘటన రెండు రోజుల క్రితం జగిత్యాల, మెట్‌పల్లి బస్ స్టాప్ వద్ద చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జూలై 20 న అనగా రెండురోజుల క్రితం ట్‌పల్లి బస్టాండ్‌లో ఓ బస్సు ఆగింది. ప్రయాణికులు ఎక్కడం, దిగడం అయ్యాక బస్సు.. కండక్టర్ సిగ్నల్ ఇవ్వడంతో బస్సు ముందుకు కదిలింది. అయితే అంతసేపు అక్కడే తచ్చాడుతున్న ఓ మహిళ.. బస్ కదలగానే ఉన్నట్లుండి దాని కింద తల పెట్టింది. ఇది గమనించిన చుట్టు పక్కల వాళ్లు గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యి బ్రేకులు వేశాడు. అయినప్పటికి బస్సు అర మీటరు వరకు ఆమెను ముందుకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో సదరు మహిళ చేతికి గాయాలు అయ్యాయి. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు
బస్సు కింద పడిన మహిళ మెట్‌పల్లికి చెందిన పుప్పాల లక్ష్మీ(48)గా గుర్తించారు. ఏవైనా సమస్యల వల్ల లక్ష్మీ ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని అనుమానిస్తున్నారు. కానీ ఆమె కుటుం సభ్యులు మాత్రం లక్ష్మికి కుటుంబంలో కానీ, ఆర్థికంగా కానీ ఎలాంటి సమస్యలు లేవని తెలుపుతున్నారు. ఆమెకు బీపీ, షుగర్ ఉన్నాయని.. అందుకే అలా కళ్లు తిరిగి పడిపోయింది అంటున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రం లక్ష్మి కావాలనే బస్ కింద తలపెట్టినట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది. పైగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అప్రమత్తంగా వ్యవహరించి సదరు మహిళను కాపాడిన డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.
అప్రమత్తంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ప్రశంసిచారు. డ్రైవర్ చాకచక్యం, సమయస్ఫూర్తి వల్ల నిండు ప్రాణం నిలబడింది అంటూ మెచ్చుకున్నారు. డ్రైవర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇక కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.