Arjun Suravaram
AI Global Summit 2024: నేడు, రేపు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్ 2024 జరగనున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏఐ రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
AI Global Summit 2024: నేడు, రేపు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్ 2024 జరగనున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏఐ రోడ్ మ్యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Arjun Suravaram
తెలంగాణలో అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో నేడు, రేపు సదస్సు జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే సదస్సును నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సమ్మిట్ లో AI రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన AI రోడ్ మ్యాప్ లో 25 కార్యక్రమాలను పొందుపరిచారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ సమీపంలోనే 200 ఎకరాల్లో AI సిటీ రాబోతుందని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో ఏఐకి సంబంధించి మరిన్ని విషయాలను ప్రకటించారు.
మానవ జీవన విధానం కొత్త దిశగా మార్చనున్న ఏఐ ఉంటుందని, ఐటీ ఉత్పతుల్లో తెలంగాణ చాలా వేగంగా ముందుకు వెళ్తుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఏంటో మనం అంతా చూస్తున్నామని, అలానే తెలంగాణ లో AI రీసెర్చ్ కోసం పెద్ద పెద్ద యూనివర్సిటీలు, విద్య సంస్థల కోసం పలు ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. డీప్ ఫేక్ లాంటివి ఏఐ మాయాజాలం, ఏఐ ను ఎథికల్ బెనిఫిట్ కోసం వినియోగించాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ కి దగ్గర లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మించ బోతున్నామని, ఇది తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఇంకా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అలానే ట్రిలియన్ డాలర్ ఎకానమీ గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని, ఏఐ గ్రోత్ లో ఇది కేవలం ఆరంభం మాత్రమేని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీ నీ భవిష్యత్ లో మరింత గా విస్తరిస్తమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇక నేడు, రేపు జరగనున్న ఈ ఏఐ సమ్మిట్ లో పలు కీలక అంశాల గురించి చర్చించనున్నారు. సమాజంపై ఏఐ ప్రభావాన్ని నియంత్రించడం, సవాళ్లను ఎదుర్కొన్నే అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవిర్ వన్’ అనే థీమ్ తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఐటీ రంగంలో ప్రపంంచలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. మరి.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
CM #RevanthReddy launched the AI City logo at the Global AI Summit, Hyderabad, marking a major step forward for the city and Telangana in becoming a global hub for AI and innovation. 🌐🚀#AISummit #AICity #InnovationInTelangana @OffDSB @TelanganaCMO pic.twitter.com/VrfhPrsDBZ
— Marpu Modalaindi (@Marpu_TG) September 5, 2024