iDreamPost

తెలంగాణ మహిళలకు శుభవార్త.. ప్రతి నెల ఖాతాల్లో రూ.2,500.. అర్హతలు ఇవే..!

  • Published Jun 18, 2024 | 12:54 PMUpdated Jun 18, 2024 | 12:54 PM

రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ మహిళలకు శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకం కింది అర్హులైన మహిళలకు 2500 రూపాయలు అందించే పథకంపై కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ మహిళలకు శుభవార్త చెప్పింది. మహాలక్ష్మి పథకం కింది అర్హులైన మహిళలకు 2500 రూపాయలు అందించే పథకంపై కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

  • Published Jun 18, 2024 | 12:54 PMUpdated Jun 18, 2024 | 12:54 PM
తెలంగాణ మహిళలకు శుభవార్త.. ప్రతి నెల ఖాతాల్లో రూ.2,500.. అర్హతలు ఇవే..!

తెలంగాణ మహిళలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి ఖాతాల్లో ప్రతి నెల 2500 రూపాయలు జమ చేసేందుకు రెడీ అవుతోంది. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన, 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి మహిళకు.. నెలకు 2500 చొప్పున అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. అలాగే ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.2500 అందుతాయని మంత్రి పొన్న స్పష్టం చేశారు.

2500 for every woman in telangana

వారికి మాత్రమే 2500

ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని అన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫించన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలకు రూ.2500 అందేలా నిబంధనలు తీసుకు రావాలని తెలంగాణ సర్కార్‌ భావిస్తోంది. అంతే కాకుండా జులై నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక మార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి పథకాలను అమలు చేశారు. ఆ తర్వాత వంద రోజుల్లోగా ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడత పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలను అమలు చేశారు.

మధ్యలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో కొన్ని పథకాల అమలుకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ముగియడంతో మిగిలిన పథకాల అమలుకు చర్యలు వేగవంతం చేశారు. త్వరలోనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. అలానే ఆగస్ట్‌ 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలానే జూలై 1 నుంచి మహిళలకు 2500 ఆర్థిక సాయాన్ని అందిచబోతున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి