iDreamPost
android-app
ios-app

ఆమె చనిపోతూ ఒక లెటర్ రాసింది! అందులో ఏముంది అంటే?

ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో చదువుపై విపరీతంగా దృష్టి పెడుతున్నారు. మరుసటి రోజు పేపర్ ఎలా ఉండబోతుందా అని టెన్షన్ పడుతూనే ఉంటారు. ఈ సమయంలో ఓ ఇంటర్ స్టూడెంట్

ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో చదువుపై విపరీతంగా దృష్టి పెడుతున్నారు. మరుసటి రోజు పేపర్ ఎలా ఉండబోతుందా అని టెన్షన్ పడుతూనే ఉంటారు. ఈ సమయంలో ఓ ఇంటర్ స్టూడెంట్

ఆమె చనిపోతూ ఒక లెటర్ రాసింది! అందులో ఏముంది అంటే?

ఇప్పుడు పరీక్షల కాలం. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు చదువుపై విపరీతంగా దృష్టి పెడుతుంటారు. అప్పటి వరకు ప్రిపేర్ అయిన సిలబస్ మొత్తం రివిజన్ చేసుకోవడం, ఎంత చదవాలని టార్గెట్ పెట్టుకోవడం, ప్రాక్టీసు చేసుకోవాలన్న టెన్షన్‌లో ఉంటారు విద్యార్థులు. పేపర్ ఎలా వస్తుందో అన్న టెన్షన్ ఓ పక్క, తాను ఎలా రాస్తానో అన్న టెన్షన్ మరో పక్క ఉంటుంది. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు తల్లిదండ్రులు కూడా తమ వంతు కృషి చేస్తుంటారు. ఎగ్జామ్స్ జరుగుతున్న ఈ సమయంలో ఓ ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సాహితీ అనే విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన హనుమకొండ జిల్లాలోని భీమారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకాని పర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య భీమారంలోని శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది. బైపీసీ గ్రూప్‌లో జాయిన అయిన సాహితీ.. ఇటీవల పరీక్షలు జరుగుతుండగా.. హాజరు అవుతుంది. శుక్రవారం ఉదయం సాహితీ తల్లిదండ్రులకు ఆమె చనిపోయిందంటూ సమాచారం అందించారు. గురువారం రాత్రి కాలేజీ భనవం నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో హుటా హుటిన తరలి వెళ్లారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

Girl wrote sucide letter

గురువారం రాత్రే సాహితీ ఆత్మహత్య చేసుకుంటే..శుక్రవారం ఉదయం వరకు సమాచారం ఇవ్వకుండా నేరుగా పోస్టుమార్టం తరలించాక సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. సాహితీ చేతికి కట్ చేసుకుని ఉండటంతో పాటు తలకు దెబ్బలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతిపై పోలీసులకు ఫిర్యాదు అందడటంతో పోలీసులు అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆమె సూసైట్ నోట్ రాసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ‘జుయాలజీ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రోజు నైట్.. 12 క్లాక్ కి చనిపోతా. వి6ని మిస్ అయితా, నిన్ను చాలా మిస్ అయితా, నాలాగా సైలెంట్ గా ఉండే వాళ్లు ఉండి వేస్ట్.అందుకే ఎవరికీ చెప్పకుండా పోతున్నా.లాట్ ఆఫ్ మెమొరీస్ విల్ థెయి్ ఇన్ లైఫ్ విత్ యు. యు విల్ బి కమ్ ఎ గ్రేట్ డాక్టర్ మిస్ యు. లవ్ యు మై హన్సిక. మై బెస్ట్ ఫ్రెండ్’ అంటూ రాసినట్లు తెలుస్తోంది. అది ఆమె చేతిరాతో కాదో తెలియాల్సి ఉంది.