iDreamPost
android-app
ios-app

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త! అంతర్జాతీయ ప్రమాణాలతో…

  • Published Oct 06, 2024 | 3:52 PM Updated Updated Oct 06, 2024 | 3:52 PM

Minister Bhatti Vikramarka Mallu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.

Minister Bhatti Vikramarka Mallu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త! అంతర్జాతీయ ప్రమాణాలతో…

గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణ ఏర్పడి తర్వాత పదేళ్ళ పాటు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ని కాదని హస్తం గుర్తుకు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. విద్య, వైద్య, వ్యవసాయ, మహిశా సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు చేస్తుంది. ఇటీవల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలపై ఫోకస్ పెడుతూనే.. ఇతర సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తుంది. తాజాగా తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలలకు సొంత భవనాలు లేవని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు.. వారికి మంచి విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాంప్లెక్స్ ల అంశంపై ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ.. ‘ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాం’అని అన్నారు.

‘తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసే ఈ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా చూస్తాం. దసరా కంటే ముందే నిర్మాణాలకు భూమి పూజ చేస్తాం. గురుకులాలు, రెసిడెన్స్ పాఠశాలలకు భారీ నిధులు కేటాయిస్తున్నాం. త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,023 స్కూళ్ళు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 600 లకు పైగా సొంత భవనాలు లేకపోవడం విచారం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తో పాటు ఇతర అభివృద్ది సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు.