iDreamPost
android-app
ios-app

భక్తులకు గుడ్ న్యూస్.. యాదాద్రికి దేశంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు

  • Published Sep 19, 2024 | 10:52 AM Updated Updated Sep 19, 2024 | 12:14 PM

Yadadri: యాదాద్రి భక్తులకు తాజాగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఓ గుడ్ న్యూస్ తెలిపారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే యాదాద్రికి త్వరలోనే ఇండియాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు రానున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలేంటో చూద్దాం.

Yadadri: యాదాద్రి భక్తులకు తాజాగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఓ గుడ్ న్యూస్ తెలిపారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే యాదాద్రికి త్వరలోనే ఇండియాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు రానున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 19, 2024 | 10:52 AMUpdated Sep 19, 2024 | 12:14 PM
భక్తులకు గుడ్ న్యూస్.. యాదాద్రికి దేశంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి. ఈ ఆలయం రాష్ట్రంలో మరో తిరుపతిగా పేరు పొందింది. అంతేకాక ఇక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక పండగలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో ఈ భక్తుల సంఖ్యగా భారీగా ఉంటుంది. ఇలాంటి సమయంలో యాదాద్రికి వెళ్లే మార్గల్లో ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో యాదగిరి గుట్టకు వెళ్లే భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కానీ, ఇక మీదట భక్తులకు ఆ సమస్య నుంచి ఊరట లభించనుంది. తాజాగా యాదాద్రి భక్తులకు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఓ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే యాదాద్రిలో దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ లింక్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇండియాలోనే రెండో అతిపెద్ద లింక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిను యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే ఇది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకు సమీపంలో ప్రత్యేకమైన స్టీల్ తో లింక్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా.. మరో మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో.. యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పలు విషయాలను తెలిపారు. ఇప్పటి వరకు యాద్రాదిలో కేవలం ఎగ్జిట్‌ ఫ్లై ఓవర్‌ పైనే ఆధారపడి ఆలయానికి భక్తులు వచ్చేవారని, మీదట లింక్‌ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో భక్తులకు ఉపశమనం కలుగుతందని మంత్రి సురేఖ పేర్కొన్నారు.

అలాగే యాదాద్రి దేవాలయం సమీపంలో 64 మీటర్లతో ఈవంతెనను నిర్మించనున్నారు. యాదాద్రి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులపై కూడా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బంగారు తాపడం పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే యాదాద్రికి సమీపంలోని రాయగిరిలో దాదాపు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల నిర్మాణ పనులను మొదలు పెడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఇది రూ.43 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆమె వివరించారు. మొత్తంగా యాదాద్రి వెళ్లే భక్తులకు త్వరలో ఈ వంతెన సౌకర్యం అందుబాటులోకి రానుంది. మరి.. దేశంలోనే రెండవ అతి పెద్ద లింక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిను యాదాద్రిలో నిర్మించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.