iDreamPost
android-app
ios-app

వర్ష బీభత్సం.. ఈ 10 జిల్లాలకు IMD రెడ్‌ అలెర్ట్‌ జారీ!

  • Published Sep 01, 2024 | 3:37 PM Updated Updated Sep 01, 2024 | 3:37 PM

తెలంగాణ రాష్ట్రంలో నేడు  బలమైన గాలులు, మెరుపులు, ఉరుములతో వర్షం దంచికొడుతున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే నేడు వాతవరణ శాఖ 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, 12జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, 13జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరీ, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో నేడు  బలమైన గాలులు, మెరుపులు, ఉరుములతో వర్షం దంచికొడుతున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే నేడు వాతవరణ శాఖ 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, 12జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, 13జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరీ, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Sep 01, 2024 | 3:37 PMUpdated Sep 01, 2024 | 3:37 PM
వర్ష బీభత్సం.. ఈ 10 జిల్లాలకు IMD రెడ్‌ అలెర్ట్‌ జారీ!

బంగాళఖాతంఓ ఏర్పడిన ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఇప్పటికే తెలంగాణలో రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో బలమైన గాలులతో జోరుగా వానలు దంచికొడుతున్నాయి. అయితే ఈ వర్షం తీవ్రత మరీంత బలపడనుందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరిచింది. ఎందుకంటే.. అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్‌ ప్రభావంతో.. రాష్ట్రంలో మరో రెండు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే భారీ వర్షం కారణంగా.. జన జీవనంత అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో వాతవరణశాఖ తాజాగా 12జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, అలాగే 13జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలో నేడు  బలమైన గాలులు, మెరుపులు, ఉరుములతో వర్షం దంచికొడుతున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే నేడు పలు జిల్లాలో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరించింది. అలాగే 12జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, 13జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అందులో అదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఇకపోతే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అంతేకాకుండా.. గంటలకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతవరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే దయచేసి ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టవద్దని హెచ్చరించారు.