iDreamPost
android-app
ios-app

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల వారు జాగ్రత్త!

  • Published Sep 08, 2024 | 2:14 PM Updated Updated Sep 08, 2024 | 2:14 PM

తెలంగాణ రాష్ట్రాంలో ఇప్పటికి వర్షాలు వీడటం లేదు. ముఖ్యంగా రానున్న 3 రోజుల‍్లో రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రాంలో ఇప్పటికి వర్షాలు వీడటం లేదు. ముఖ్యంగా రానున్న 3 రోజుల‍్లో రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతవరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.

  • Published Sep 08, 2024 | 2:14 PMUpdated Sep 08, 2024 | 2:14 PM
తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల వారు జాగ్రత్త!

తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులు క్రితం కురిసిన భారీ వర్షాలు, వరద తీవ్రత ఎంతటి భీభత్సం సృష్టించయో అందరికీ తెలిసిందే.    అయితే ఇప్పటికి ఈ వరద తీవ్రతల నుంచి తెలంగాణ ప్రజలు ఇంక కోలుకోనేలేదు. అయిన సరే రాష్ట్రంలో వర్షాలు ఇంక వీడటం లేదు. ముఖ్యంగా శనివారం (సెంప్టెంబర్ 7)న పలు జిల్లాలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తాజాగా వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రానున్న రానున్న 3 రోజుల‍్లో రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, వాటిలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

అలాగే మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతవరణ శాఖ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. నిన్న శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే.. మహబూబాబాద్‌లో 18.2 సెం.మీ వర్షపాతం నమోదవ్వగా,  ఖమ్మం జిల్లా తల్లాడలోనూ 12.2 సెం.మీ, రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్‌లో 11.1 సెం.మీ, అమనగల్‌లో 9.8 సెం.మీ, భద్రాద్రి జిల్లా చంద్రుగొండలో 9.3 సెం.మీ వర్షం కురిసిందని చెప్పారు. దీంతో ఇప్పటికే మున్నేరు నదితో పాటు పలు వాగులకు వరద ఉద్ధృతి పెరగడంతో వెంటనే  అధికారులు అలర్ట్ అయ్యి ఆ ప్రాంతంలోని ప్రజలకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు. మరీ, తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.