తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు..కానీ, ఆ గండం తప్పింది

Hyderabad: తెలంగాణ రాష్ట్రాంలో నేడు వర్షం తీవ్రత కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. కానీ, నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రజలు ఆందోళలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే..తాజాగా తెలంగాణ రాష్ట్రానికి వాతవరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఆ వివరాలేంటో చూద్దాం.

Hyderabad: తెలంగాణ రాష్ట్రాంలో నేడు వర్షం తీవ్రత కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. కానీ, నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రజలు ఆందోళలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే..తాజాగా తెలంగాణ రాష్ట్రానికి వాతవరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఆ వివరాలేంటో చూద్దాం.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి క్లౌడ్ బరస్ట్ అయిన విధంగా భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాగులు, నదులు,చెరువులు పొంగిపోయి రహదారులు, ఇళ్లులు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే వరద ఉధృతికి చాలామంది ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు. అసలు రాష్ట్రాంలో ఏ వైపు చూసిన వరద నీరు పొంగిపోర్లుతున్నాయి. ముఖ్యంగా బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో వరుణుడు భీభత్సం సృష్టించడనే చెప్పవచ్చు. ఇక ఈ వరదల ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు అడుగుపెట్టాలంటే భయపడ్డారు. అయితే ఈ వర్ష ప్రభావం నేడు కూడా రాష్ట్రంలో ఉంటుదని వాతవరణ శాఖ నిన్న హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో విద్య సంస్థలన్నింటికి సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..తాజాగా తెలంగాణ రాష్ట్రానికి వాతవరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.ఆ వివరాలేంటో చూద్దాం.

రాష్ట్రాంలో నేడు వర్షం తీవ్రత కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. కానీ, నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రజలు ఆందోళలో ఉన్నారు. కానీ, ఈ సమయంలోనే రాష్ట్రా ప్రజలకు ఊరటనిస్తూ.. ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ అదేమిటంటే.. బంగాళఖాతంలో వాయుగుండం పూర్తిగా బలహీనపడుతుందని.. మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్రంలో ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవని పేర్కొంది. కాకపోతే రాబోయే ఐదు రోజులు పాటు అంటే..సెప్టెంబర్ 6వ తేదీ వరకు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇకపోతే తూర్పు విదర్భను అనుకొని.. తెలంగాణ మీదుగా బలహీనపడిన వాయుగుండం కేంద్రీకృతం అయ్యి ఉందని తెలిపారు. అయితే ఇది సెప్టెంబర్ 2వ తేదీ నాటికి రామగుండకు ఈశాన్యదిశగా 130 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ఈ ప్రభావమే నేడు (సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడతాయని వాతవరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 24 గంటలు అంటే.. సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మరీ, తెలంగాణ రాష్ట్రం భారీ వర్షాల ముప్పు లేదని ఐఎండీ పేర్కొనడం పై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments