P Krishna
Big Alert for Telangana Residents: మార్చి నెల నుంచి తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.గత పదిరోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Big Alert for Telangana Residents: మార్చి నెల నుంచి తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.గత పదిరోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
P Krishna
తెలంగాణలో మార్చి మొదటి వారం నుంచి వాతావరణంలో పలు మార్పులు సంభవించాయి. మార్చి నెల నుంచే ఎండలు మండిపోవడంతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. గత పది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని అంటున్నారు. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే.. మే నెలల ఎంత దారుణంగా ఉంటుందో అని భయపడుతున్నారు. రోడ్లపైకి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో విపరీతమైన వడగాలులు వీస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు చల్లని పానియాల వెంట పరుగులు తీస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ఎండలు మండుతున్నాయి.. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాలిపోయి సేద తీరుతున్నారు ప్రజలు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు బాగా పెరిగిపోయాయి.. ఇక మే నెల పరిస్థితి ఏంటో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా తెలంగాణ ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో మంది చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న వేడిగాలుల నుంచి వర్షాలతో కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలువు వీస్తాయని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం మూడు రోజుల కొనసాగుతుందని తెలిపింది. ఏప్రిల్ 8న తెలంగాణ జిల్లాల్లో నిర్మల్, కుమురంభీమ్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జిగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల లో వర్షపాతం నమోదు అవుతుంది. వీటితో పాటు కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుసగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే గత పదిరోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు బారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా నల్లగొండలో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మొత్తానికి ఐఎండీ ఓ చల్లని కబురు అందించింని ప్రజలు అంటున్నారు.