ఈరోజు సాయంత్రం ఆఫీసుల నుండి త్వరగా వెళ్లిపోండి! లేకుంటే చిక్కులే!

Heavy Rain- IMD Orange Alert To Hyderabad: నగర వాసులకు కీలక అలర్ట్‌.. సాయంత్రం త్వరగా ఇళ్లకు చేరే ప్రయత్నాలు చేయండి లేదంటే.. మీకు చిక్కులు తప్పవు అంటున్నారు అధికారులు. కారణం ఏంటంటే..

Heavy Rain- IMD Orange Alert To Hyderabad: నగర వాసులకు కీలక అలర్ట్‌.. సాయంత్రం త్వరగా ఇళ్లకు చేరే ప్రయత్నాలు చేయండి లేదంటే.. మీకు చిక్కులు తప్పవు అంటున్నారు అధికారులు. కారణం ఏంటంటే..

మీరు భాగ్యనగరంలో ఉంటున్నారా.. ఉద్యోగాల నిమిత్తం ఆఫీసులకు వెళ్తున్నారా.. లేదంటే మీ పనిలో భాగంగా బయటకు వచ్చారా.. అయితే మీకోసమే ఈ అలర్ట్‌. సాయంత్రం త్వరగా ఇళ్లకు చేరండి. ఏమాత్రం ఆలస్యం చేసినా చిక్కుల్లో పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం ఆఫీసుల నుంచి త్వరగా ఇళ్లకు బయలుదేరి వెళ్లమని చెబుతున్నారు. ఇంతకు ఏం జరిగింది.. ఎందుకు ఇలాంటి అలర్ట్‌ జారీ చేశారు అనే వివరాలు తెలియాలంటే ఇది చదవండి..

ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నగరంలో జోరు వాన కురిసింది. సాధారణంగా చాలా మందికి ఆదివారం సెలవు కావడంతో.. భారీ వర్షం కురిసినా ట్రాఫిక్‌ ఇబ్బందులు పెద్దగా ఎదురు కాలేదు. ఇక నేడు అనగా సోమవారం నాడు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. చెప్పడమే కాక ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వాటిల్లో సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలు ఉన్నాయి.

ఇక భాగ్యనగరానికి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఈ క్రమంలో నేడు అనగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. కనుక ఉద్యోగస్తులు ఆఫీసుల నుంచి త్వరగా ఇళ్లకు చేరుకోమని సలహా ఇస్తున్నారు అధికారులు. ఆలస్యం అయ్యి.. తీరా వర్షం మొదలయ్యాక బయలు దేరితే.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తుందంటున్నారు అధికారులు. కనుక వీలైనంత త్వరగా పని ముగించుకుని.. త్వరగా ఇంటికి చేరుకునే ప్రయత్నం చేయమని సూచిస్తున్నారు.

బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. దాంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో మాత్రమే కాక.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా మంచిర్యాలలో 159.3 మిమీ వర్షపాతం నమోదు కాగా.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో అ‍త్యధికంగా 94.8 మిమీ వర్షపాతం నమోదయ్యింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇతర సిబ్బంది రంగంలోకి దిగి సహాయయ చర్యలు ప్రారంభించారు.

Show comments