Arjun Suravaram
Smita Sabharwal: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఓ ఇష్యూతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. అంతేకాక ఆమె తరచూ వివిధ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా స్మితా సబర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
Smita Sabharwal: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఓ ఇష్యూతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. అంతేకాక ఆమె తరచూ వివిధ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా స్మితా సబర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
Arjun Suravaram
ప్రతి ఒక్కరి డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఆ ధనం కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటాము. ఇది ఇలా ఉంటే.. కొన్ని సందర్భాల్లో ఒక్కేసారి భారీగా నగదు పొందే అవకాశాలు వస్తుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు, పోటీలు నిర్వహించి..భారీగా నగదు ఇస్తుంటారు. అలానే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక చిన్న ఐడియా ఇవ్వండి..లక్ష గెలవండి అంటూ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ప్రకటన చేశారు. పూర్తి స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ప్రభుత్వంలో సీఎంవో కార్యదర్శిగా ఆమె పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే సివిల్స్ పరీక్షల్లో దివ్యాగులకు రిజర్వేషన్లపై ఆమె పోస్టు చేయడం.. ఆ తరువాత పెద్ద రచ్చ జరగడం అందరికి తెలిసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆమె..తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటారు. అలానే నెటినజ్ల నుంచి కూడా వివిధ అంశాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఆమె ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. అయితే ఈ సారి వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించి కాకుండా.. పరిపాలనకు సంబంధించి పెట్టారు. అదిరిపోయే ఐడియా ఇవ్వండి.. లక్ష గెలుచుకోండి.. అంటూ స్మితా సబర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం పెంచే ఇన్నోవేషన్ ఐడియా ఇవ్వండి, లక్ష రూపాయలు గెలవండి అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ఎవరైనా తమ ఐడియాలను..tgsfc2024@gmail.com అనే మెయిల్ పంపాలని ఆమె కోరారు. ఈ నెల 30 వరకు తమ విభిన్నమైన ఆలోచనలు పంపాలని తెలిపారు. మంచి ఐడియాలకు రూ. లక్ష వరకు నగదు బహుమతి అందజేస్తామన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ఈ ఐఏఎస్ అధికారిణి తీసుకున్నఈ విభిన్నమై చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Field interactions/academic research coupled with your innovative ideas 💡
makes us at #Telangana Finance Commission a cut above the ordinary! Don’t miss the chance to be a part of this Constitutional process.Google form below:https://t.co/dc9LByVxfa pic.twitter.com/IUyDXoob9A
— Smita Sabharwal (@SmitaSabharwal) August 16, 2024