HYDRA: హైడ్రా సంచలన నిర్ణయం! ఇక నుంచి ఫుల్ ఫోకస్ వారి మీదే!

HYDRA Targets Officials: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. హైడ్రా. చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ పోతోంది. తాజాగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

HYDRA Targets Officials: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. హైడ్రా. చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ పోతోంది. తాజాగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. హైడ్రా. చెరువులతో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ పోతోంది. ఈ క్రమంలో సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడాల్లేకుండా.. ఆక్రమణలకు పాల్పడిన వారి పని పడుతోంది. రీసెంట్​గా టాలీవుడ్ టాప్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్​ను కూల్చివేసింది. దీంతో హైడ్రా పేరు బాగా వినిపిస్తోంది. భూకబ్జాలు చేసి కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరును అంతా మెచ్చుకుంటున్నారు. ఈ పేరు వింటే అక్రమార్కులు వణికిపోతుంటే.. సామాన్యులు మాత్రం శభాష్​ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తమ ఫోకస్​ను వాళ్ల పైకి షిఫ్ట్ చేయనుంది.

ప్రభుత్వ స్థలాల్లో కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారిన హైడ్రా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువు స్థలాల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారుల మీద ఫుల్ ఫోకస్ చేయాలని డిసైడ్ అయింది. హైదరాబాద్​లోని గండిపేట, మాదాపూర్ ఏరియా పరిసరాల్లోని కట్టడాలకు అనుమతించిన అధికారుల మీద చర్యలకు రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఆ ప్రదేశాల్లో అక్రమ కట్టడాలకు పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోవాలని హైడ్రా ఆదేశించిందని సమాచారం. అలాగే 5 మంది ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు కూడా చేసిందట. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా తాజా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చిన వారిపై ఫోకస్ చేయడం, చర్యలకు ఆదేశించడం భేష్ అని మెచ్చుకుంటున్నారు.

ఉన్నతాధికారుల మీద కేసులు నమోదు చేయాలని ఆదేశించడం గ్రేట్ అని.. హైడ్రా దూకుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన టీమ్ పనిచేస్తున్న తీరును, అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో ఎవరికీ భయపడకుండా ముందుకు వెళ్తున్న తీరు సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్​కు తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచింది. హైడ్రా చర్యల నేపథ్యంలో ఆయనకు ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉండంటంతో భద్రతా సిబ్బందితో కూడిన కాన్వాయ్​ను సర్కారు సమకూర్చింది. అలాగే మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి దగ్గర ఇద్దరి సెక్యూరిటీతో కూడిన ఔట్​పోస్ట్​ను కూడా ఏర్పాటు చేసింది. మరి.. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తూ హైడ్రా తీసుకున్న తాజా నిర్ణయంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments