iDreamPost
android-app
ios-app

హైడ్రా కమిషనర్‌కు మరో కీలక బాధ్యత.. తరువాత ఈ 7 జిల్లాల్లో కూడా!

  • Published Sep 03, 2024 | 2:26 PM Updated Updated Sep 03, 2024 | 2:26 PM

HYDRAA: ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను నిర్దాక్ష్యంగా హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. ఇంతకీ అదేమిటంటే..

HYDRAA: ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను నిర్దాక్ష్యంగా హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. ఇంతకీ అదేమిటంటే..

  • Published Sep 03, 2024 | 2:26 PMUpdated Sep 03, 2024 | 2:26 PM
హైడ్రా కమిషనర్‌కు మరో కీలక బాధ్యత.. తరువాత ఈ 7 జిల్లాల్లో కూడా!

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల పై హైడ్రా ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంలో సామాన్యులు, ధనికులు, సెలబ్రిటీస్ అనే తేడా లేకుండా రూల్స్ భిన్నంగా నిర్మణాలను నిర్ధాక్ష్యిణంగా కూల్చేస్తున్నారు. కాగా, ఇప్పటికే నగరంలో రోజుకొక ప్రాంతంలో అక్రమ నిర్మాణలను గుర్తించి.. నోటీసులు ఇచ్చిన రోజుల వ్యవధిలోనే హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా న్ కన్వెన్షన్, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఇచ్చిన నోటిసులు చూస్తుంటే.. ఈ విషయంలో హైడ్రా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చేస్తున్న జోరును కొనసాగిస్తుందని చెప్పవచ్చు.ఇదిలా ఉంటే.. తాజాగా ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ కు మరో కీలక బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రస్తుతం అక్రమ నిర్మాణాలను నిర్దాక్ష్యంగా హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. ఇంతకీ అదేమిటంటే.. హెచ్ఎండీఏ పరిధిలో ఏడు జిల్లాలు ఉన్నాయి. అయితే ఆయా జిల్లాలో చెరువులు పరిరక్షణను కూడా తాజాగా హైడ్రా కమిషనర్ కు అప్పగించినట్లు తెలుస్తుంది. తద్వారా నగరంలో మరీంత ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు హైడ్రాతో పాటు లేక్ ప్రొడెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతల అప్పగింతపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇకపోతే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ, నోటిఫికేషన్‌ పూర్తి చేయాలని ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదేశించారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో కూడా  చెరువులు ఉండగా.. ఆయా జిల్లాల కలెక్షర్లతో సోమవరాం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ను  నిర్వహించారు. మరోపక్క నవంబరు 1వతేదీ లోగా అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో మెుత్తం 3,500 చెరువులు ఉండగా…ఇప్పటివరకు 265 చెరువులను మాత్రమే నోటిఫై చేసినట్లు తెలిపారు.  త్వరలోనే మిగిలిన చెరువులను నోటిఫై చేసి అక్రమ నిర్మానాలను కూల్చివేస్తామని ఇదివరకే హైడ్రా  పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయపం నగరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెతున్నాయని చెప్పవచ్చు. మరీ త్వరలోనే హైడ్రా కమిషనర్ కు సర్కార్ మరో కీలక బాధ్యతలను అప్పగించరనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.