Keerthi
HYDRAA: నగరంలో ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న ఆక్రమాల నిర్మాణాలపై దృష్టి పెట్టి వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ప్రాంతం పైనే అంటూ సమాచారం వినిపిస్తుంది.
HYDRAA: నగరంలో ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న ఆక్రమాల నిర్మాణాలపై దృష్టి పెట్టి వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ప్రాంతం పైనే అంటూ సమాచారం వినిపిస్తుంది.
Keerthi
హైడ్రా.. నగరంలో గతకొన్ని రోజులుగా అక్రమదారులకు ఏ స్థాయిలో హడలెత్తిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగరంలోని చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్లు, బఫర్జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు అని తేడా లేకుండా.. ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో సామన్యులు, ధనికులు అనే తేడా లేకుండా.. రూల్స్ భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలపై నిర్ధాక్ష్యిణ్యంగా కూల్చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో రోజుకొక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, నోటిసులు ఇచ్చిన రోజుల వ్యవధిలోనే..హైడ్రా బుల్డోజర్లతో ఆ అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతంపై హైడ్రా కూల్చివేయడానికి వస్తుందనని అక్రమదారులకు గుండెల్లో గుబులు పుడుతంది. అయితే తాజాగా హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ప్రాంతం పైనే అంటూ సమాచారం వినిపిస్తుంది. ఇంతకీ ఎక్కడంటే..
నగరంలో ఇప్పటికే ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న ఆక్రమాల నిర్మాణాలపై దృష్టి పెట్టిన హైడ్రా తాజాగా ఇప్పుడు హైటెక్ సిటీ పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడ రెండు నాలాలాను సర్వే చేసేందుకు ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సర్వే ద్వారా ఈ నాలలపై ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సర్కార్ ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలన్నది నిర్ణయిస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఈ సర్వే చేపట్టానికి మరో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా, ఇప్పటికే ఈ విషయంపై హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం సమావేశమైనట్లు తెలిసింది.
ఇకపోతే హైటెక్ సిటీ పరిధిలో ఇటీవలే కురిసిన వర్షాలకు కొన్ని కాలనీలు మొత్తం మునిగిపోయాయిన విషయం తెలిసిందే. దీంతో వానలు ఎక్కువగా పడుతున్నప్పుడు హైటెక్‌సిటీ పరిధిలో ఉన్న ఆ రెండు నాలాలు సమీపంలో ఉన్న ఏయే కాలనీలు మునుగుతున్నాయి? కారణాలేమిటి అనేది హైడ్రా ఇప్పుడు తెలుసుకోనుంది. పైగా నీళ్లు నిండిన ప్రాంతాల్లో డ్రోన్లతో సర్వే చేసి ఆక్రమణలను గుర్తించి, ఆ తర్వాత కూల్చివేతలకు దిగబోతుందని సమాచారం. ఒకవేళ అదే కనుకు నిజమైతే ఈసారి హైటెక్ సిటీ పరిధిలో ఇంకెన్ని అక్రమ నిర్మాణాలు బయటపడతాయో, మరెన్నీ నిర్మాణలు కూలబడతాయో అనే విషయాలు త్వరలోనే తెలియరానుంది. దీంతో ప్రస్తుతం హైటెక్ సిటీ పరిధిలో ఉన్న అక్కమదారులకు ఈ సమాచారం వినిపించడంతో ఇప్పటికే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. మరీ, హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హైటెక్ సిటీ అనే సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.