హైడ్రా కమిషనర్‌ సంచలన నిర్ణయం.. వాటిని మాత్రమే కూల్చేస్తామంటూ క్లారిటీ!

Hydra Commissioner AV Ranganath: గతకొన్ని రోజులుగా నగరంలో అక్రమదారులకు హైడ్రా హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో సామన్యుల సైతం ఈ విషయంలో గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Hydra Commissioner AV Ranganath: గతకొన్ని రోజులుగా నగరంలో అక్రమదారులకు హైడ్రా హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో సామన్యుల సైతం ఈ విషయంలో గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

నగరంలో గతకొన్ని రోజులుగా అక్రమదారులకు హైడ్రా హడలెత్తిస్తోంది. ముఖ్యంగా నగరంలోని చెరువులు, కుంటలు, కుంటలు, ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లు, నాలాలు, ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల పై హైడ్రా ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సామాన్యులు, ధనికులు, సెలబ్రిటీస్ అనే తేడా లేకుండా రూల్స్ భిన్నంగా నిర్మణాలు ఉంటే.. నిర్ధాక్ష్యిణంగా వాటిని కూల్చేస్తున్నారు. కాగా, ఇప్పటికే నగరంలో రోజుకొక ప్రాంతంలో అక్రమ నిర్మాణలను గుర్తించి.. నోటీసులు ఇచ్చిన రోజుల వ్యవధిలోనే.. హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

చాలావరకు నగరంలోని ప్రజలు ఎఫ్టీఎల్ , బఫర్ జోన్ అని తెలియక.. స్థలాలు కొనుక్కుని ఇండ్లు కట్టుకుని నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే హైడ్రా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పై సామాన్యుల్ల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. అంతేకాకుండా.. నిర్ధాక్ష్యణంగా కూల్చివేతలపై హైడ్రాకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై స్పందించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో ఇప్పటికే నిర్మించి.. అందులో నివాసముంటున్న ఇళ్లను ఎట్టిపరిస్థితుల్లో కూల్చబోమని రంగనాథ్‌ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు.

అయితే వలం ఎఫ్టీఎల్, బఫర్‌ జోన్‌లో నిర్మిస్తున్న కొత్త కట్టాడాలను మాత్రమే కూల్చివేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు మాదాపూర్ సున్నం చెరువు, దుండిగల్‌లోని మల్లంపేట్ చెరువులో ఈరోజు కూల్చివేసిన కట్టడాలన్ని.. నిర్మాణ దశలోనే ఉన్నాయని.. అవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండా కడుతున్నారని చెప్పుకొచ్చారు. వాటితో పాటు అమీన్‌పూర్‌లో కూల్చివేసిన నిర్మాణాలు కూడా అక్రమంగా నిర్మించినవేనని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఇక సున్నం చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాణిజ్యపరమైన షెడ్లను కూల్చేశామని తెలిపారు. అలాగని.. జనాలు నివాసముంటున్న ఇండ్లను కూల్చివేయమని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

కానీ, ఇకపై నగరంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న ఇల్లు, ఫ్లాట్, భూమిని ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని నగరవాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళా అటువంటి ఆస్తులపై ఏదైనా సందేహం ఉంటే వెంటనే HMDA సరస్సుల వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని లేదంటే అధికారులను సంప్రదించి పూర్తి క్లారిటీ వచ్చాకే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. మరీ, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అక్రమ నిర్మాణాలపై  కూల్చివేతపై తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments