iDreamPost
android-app
ios-app

మిలాద్‌ ఉన్‌ నబీ.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

  • Published Sep 19, 2024 | 9:45 AM Updated Updated Sep 19, 2024 | 10:29 AM

Traffic Restrictions in Hyderabad: ప్రస్తుతం వరుసగా పండుగల సీజన్ నడుస్తుంది. దేశ వ్యాప్తంగా వినాయక చతుర్ధి సంబరంగా జరుపుకున్నారు.. వీధి వీధిలో కొలువైన ఉన్న గణనాథుడిని నిమజ్జనం చేశారు. నేడు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

Traffic Restrictions in Hyderabad: ప్రస్తుతం వరుసగా పండుగల సీజన్ నడుస్తుంది. దేశ వ్యాప్తంగా వినాయక చతుర్ధి సంబరంగా జరుపుకున్నారు.. వీధి వీధిలో కొలువైన ఉన్న గణనాథుడిని నిమజ్జనం చేశారు. నేడు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

మిలాద్‌ ఉన్‌ నబీ.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

గత నెల ఆగస్టు నుంచి శ్రావణ మాసం మొదలైంది. వరుసగా పండుగల సీజన్ స్టార్ట్ అయ్యింది.  హైదరాబాద్‌లో వినాయ చతుర్ధి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. మొన్న నగరంలో భారీ సంఖ్యల్లో నిమజ్జనాలు జరిగాయి.  సాధారణంగా భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాలు జరిగితే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మరోసారి ట్రాఫిక్ అంక్షలు విధించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా గురువారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ ఆంక్షలు గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. మిలాద్-ఉన్-నబీ పురస్కరించుకొని గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఊరేగింపులు నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫలక్ నూమా నుంచి వోల్డా హూటల్, యాహియా పాషా దర్గా నుంచి వోల్టా హూటల్, మక్కా మసీద్ నుంచి హౌజ్ హౌస్, పత్తర్ గట్టి అలాజా కోట్ల వరకు ఊరేగింపులు ఉండనున్నాయి. ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల్సి ఉంటుందని.. వాహనదారులు సహకరించాలని కోరారు.

మిలాద్-ఉన్-నబీ ప్రధాన ఊరేగింపు సయ్యద్ క్వాద్రీ చమన్, పలక్ నూమా, గులాం ముర్తుజా కాలనీ నుంచి ప్రారంభం కానుంది. లాల్ దర్వాజ్ ఎక్స్ రోడ్, అలియాబాద్ ఎక్స్ రోడ్, గుల్జార్ హౌస్, మదీనా, చార్మినార్, నయాపుల్ బ్రిడ్జి, సాలార్జంగ్ మ్యూజియం, పురానీ హవేలీ మీదుగా ఊరేగింపు మొదలై.. బీబీ బజార్, ఎటెబార్ చౌక్ లో ముగియనుంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ను మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్డు మీదుగా కందికల్ గేట్, కర్నూల్ రోడ్, పీసల్ బండ వైపు.. శంషీర్‌గంజ్, నాగుల చింత మీదుగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులకు ఈ రూట్స్ లో ఇబ్బందులు తలెత్తితో 9010203626 నెంబర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.