Hyderabadలో పెట్టుబడుల పేరుతో భారీ మోసం! రూ. 500 కోట్లతో పరార్..

Hyderabad News: నేటికాలంలో మోసాలు అనేక రకంగా జరుగుతున్నాయి. అధిక డబ్బులు ఆశ చూపి సామాన్యులను, నిరుద్యోగులను, గృహిణీలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి మోసాలు చాలా జరగ్గా..తాజాగా హైదరాబాద్ లో ఘరానా మోసం చోటుచేసుకుంది.

Hyderabad News: నేటికాలంలో మోసాలు అనేక రకంగా జరుగుతున్నాయి. అధిక డబ్బులు ఆశ చూపి సామాన్యులను, నిరుద్యోగులను, గృహిణీలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి మోసాలు చాలా జరగ్గా..తాజాగా హైదరాబాద్ లో ఘరానా మోసం చోటుచేసుకుంది.

నేటికాలం అక్రమంగా డబ్బులు సంపాదించే వారు బాగా పెరిగిపోయారు. సామాన్యులకు మాయమాటలు చెప్పి..తమ బుట్టలో వేసుకుని చివరకు నిండ ముంచేస్తున్నారు. ముఖ్యంగా యువత, గృహిణిలు, నిరుద్యోగులనే లక్ష్యగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇన్వెస్ట్ మెంట్ల పేరుతో అధిక వడ్డీలు చూపి…జనాలను మోసం చేస్తున్నారు. అలా వివిధ బురిడీ సంస్థలు ఏర్పడి..కోట్లు వచ్చాక.. బోర్డు తిప్పేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరగ్గా..తాజాగా హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో డీకేజెడ్ టెక్నాలజీ అనే పేరుతో మహమ్మద్ ఇక్బాల్, రాహిల్, డీకేజెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని ఫుల్ ప్రచారం చేశారు. అలానే నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టోర్స్ ద్వారా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామంటూ నిందితులు గట్టిగా ప్రచారం చేశారు. వారి మాటలు నమ్మి చాలా మంది ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అలా సామాన్యుల నుంచి దాదాపు 500 కోట్ల వరకు సంస్థ నిర్వాహకులు వసూలు చేశారు. తొలిరోజుల్లో పెట్టుబడి పెట్టిన వాళ్లకి అధిక వడ్డీల రూపంలో నగదును నిర్వాహాకులు చెల్లించారు.

అలా కొన్ని నెలల పాటు..ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తూ వచ్చారు నిర్వహాకులు. ఈ క్రమంలోనే ప్రతి నెల వడ్డీలు చెల్లిస్తుండడంతో వేల మందితో అప్పటికే అందులో చేరిన వాళ్లు పెట్టుబడులు పెట్టించారు. ఇలా ఆ సంస్థను పూర్తిగా నమ్మిన క్రమంలోనే పెట్టుబడి పెట్టిన వారికి నిర్వాహకలు గట్టి షాకిచ్చారు. గత రెండు నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో కస్టమర్లకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే డీకేజెడ్ కంపెనీ నిర్వాహకులను వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలోనే సదరు కంపెనీ నిర్వాహకులు ఆఫీస్ కు తాళం వేసి.. పరారయ్యారు. దీంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు  దేశంలోని ఏదో ఒక ప్రాంతలో తరచూ జరుగుతుంటాయి.  నిరుద్యోగులను సైతం ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి..వారి నుంచి లక్షల రూపాయలను తీసుకుంటారు. రెండు, మూడు నెలలు ఏదో జాబ్ ఇచ్చినట్లు వారిని నమ్మించి..మరికొందరు చేరిన తరువాత..బోర్డు తిప్పిస్తున్నారు. ఇలా ఎంతో మంది నిరుద్యోగులు, సామాన్య ప్రజలు  నిండా మోసపోతున్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతూనే ఉంటారు. అయిన ప్రజలు కేటుగాళ్ల మాటలు నమ్మి వాళ్ల వలల చిక్కుకుంటారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments