Hyderabad వాసులకు శుభవార్త.. గాంధీ ఆస్పత్రిలో IVF సెంటర్..!

Damodar Raja Narsimha-IVF Services, Gandhi Hospital: పేదలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలను అందించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

Damodar Raja Narsimha-IVF Services, Gandhi Hospital: పేదలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలను అందించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

ఈమధ్య కాలంలో సమాజంలో పెరుగుతున్న అతి పెద్ద సమస్య.. సంతానలేమి. మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా.. ఇన్ ఫెర్టిలిటీ సమస్య పెరుగుతోంది. చాలా మంది జంటలు సంతానం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఐవీఎఫ్ వంటి పద్దతులను ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే ఈ చికిత్స విధనాలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహరాలు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సర్వీసులు ఉచితంగా లభించవు. దాంతో ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ ఖర్చును భరించలేని వారు.. దేవుడి మీద భారం వేసి.. బిడ్డల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సేవలను ప్రభుత్వ ఆస్పత్రిలో ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

సంతానలేమి సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలను ప్రారంభించబోతున్నారు. వారం రోజుల్లోనే గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌ను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రకటించారు. గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన నర్సింగ్ సిబ్బంది, విధుల్లో ఉన్న వైద్యులు, డయాగ్నోస్టిక్, క్లినికల్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు దామోదర రాజ నర్సింహ్మ. ఆస్పత్రిలో ఎలా ఉందని ఆరా తీశారు. రోగులు నేలపై కూర్చొని ఉండడాన్ని గమనించిన ఆయన సరైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వసతి గృహానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నామని.. దీని నిర్మాణం కోసం ఇప్పటికే రూ.78 కోట్లు నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. కింగ్ కోటి ఆసుపత్రిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మందిరాన్ని మంత్రి పరిశీలించారు.

ఇక గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సేవలు ప్రారంభం చేయబోతుండంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల ఖరీదైన వైద్య సేవలను.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించనుందని తెలియడంతో జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Show comments