Shikha Goel: రాజస్థాన్ లో HYD పోలీస్ ఆపరేషన్.. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠా అరెస్టు!

Shikha Goel- Telangana Cyber Security Police: పోలీసులు అంటే సినిమాల్లో హీరోలుగానే కనిపిస్తారు. కానీ, రియల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. సినిమా స్టైల్ ఎలివేషన్స్ నిజ జీవితంలో కుదరదు. కానీ, ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు హీరోలను మించి పోయారు. రియల్ లైఫ్ హీరోలు అనిపించుకుంటున్నారు.

Shikha Goel- Telangana Cyber Security Police: పోలీసులు అంటే సినిమాల్లో హీరోలుగానే కనిపిస్తారు. కానీ, రియల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. సినిమా స్టైల్ ఎలివేషన్స్ నిజ జీవితంలో కుదరదు. కానీ, ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు హీరోలను మించి పోయారు. రియల్ లైఫ్ హీరోలు అనిపించుకుంటున్నారు.

మీరు సినిమాల్లో చాలాసార్లు పోలీసుల పవర్ చూసుంటారు. అయితే రియల్ లైఫ్ లో ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం కుదరకపోవచ్చు. ప్రతిసారి హీరో అవ్వడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ, హైదరాబాద్ పోలీసులు మాత్రం ప్రతిసారి హీరోలు అవుతున్నారు. ఎలాంటి కేసు అయినా కూడా దాని అంతు తేల్చి రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. వాళ్లు సాధించిన ఘనత అంత చిన్నదేం కాదు. వాళ్లు ఒక సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. వారిపై దేశవ్యాప్తంగా 2 వేల 223 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు వాళ్లను ఏ పోలీసులు పట్టుకోలేకపోయారు. కానీ, హైదరాబాద్ పోలీసులు మాత్రం ఖాకీ మూవీ రేంజ్ ఆపరేషన్ చేసి వారిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను…. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ డీజీపీ శిఖా గోయల్ వెల్లడించారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఒక పెద్ద సైబర్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాకి సంబంధించి దేశవ్యాప్తంగా కేసులు ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను అరెస్టు చేశారు. మొత్తం 4 స్పెషల్ బృందాలుగా ఏర్పడి 27 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. మొత్తం 15 రోజులపాటు ఈ ఆపరేషన్ సాగింది. ఈ ముఠాను ఇప్పటి వరకు దేశంలోని ఏ పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. తొలిసారి అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సైబర్ క్రైమ్ ముఠా మీద తెలంగాణ రాష్ట్రంలో 189 కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నాయి. ఇంక దేశవ్యాప్తంగా ఈ ముఠాపై ఏకంగా 2 వేల 223 కేసులు ఉన్నాయి.

ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను శిఖా గోయల్ మీడియాతో వెల్లడించారు. ” ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి. ముసలివాళ్ల నుంచి అందరినీ ఈ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ ముఠాలో మొత్తం 27 మంది సభ్యులు ఉన్నారు. ఈ ముఠా సభ్యులపై దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా కేసులు ఉన్నాయి. వీళ్లు కరెంట్ అకౌంట్స్ వంటి వాటిని టార్గెట్ చేసి నేరాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ అమౌంట్ లావాదేవీలు చేసే వారు చిన్న చిన్న మొత్తాలు చూసుకోక పోవచ్చు. దాదాపు వీళ్లు 50 వేల నుంచి మోసాలు చేస్తూ ఉంటారు. సైబర్ నేరాలు ఎక్కువగా కంబోడియా, వియత్నాం, మయన్మార్ వంటి దేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. వీళ్లు రాజస్థాన్ నుంచే మోసాలు చేస్తున్నారు. వీరి నుంచి 31 మొబైల్స్, 37 సిమ్స్, 13 ATMలు, 2 చెక్ బుక్స్ , హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు” అంటూ శిఖా గోయల్ వెలల్డించారు.

ఈ సైబర్ నేరగాళ్ల ఖాతాల నుంచి 11 కోట్ల రూపాయల వరకు వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు తేలింది అన్నారు. ఇలాంటి ఒక ముఠా పోలీసులకు దొరకడం ఇదే తొలిసారి. అలాంటి అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ టీమ్ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో.. నేరగాళ్లకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చనట్లు అయ్యింది అంటున్నారు. ఇలాంటి చర్యలతో తెలంగాణ పోలీసులు ప్రజల్లో ధైర్యం నింపుతున్నారని కామెంట్ చేస్తున్నారు. మరి.. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments