P Krishna
Telangana Assembly Speaker Gaddam Prasad Kumar: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. కొత్త కొత్త టెక్నాజీ ఉపయోగించి సైబర్ నేరగాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖులకు సంబంధించిన ట్విట్టర్, ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేస్తున్న విషయం తెలిసిందే.
Telangana Assembly Speaker Gaddam Prasad Kumar: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. కొత్త కొత్త టెక్నాజీ ఉపయోగించి సైబర్ నేరగాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖులకు సంబంధించిన ట్విట్టర్, ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేస్తున్న విషయం తెలిసిందే.
P Krishna
ఇటీవల ఫైస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా అకౌంట్స్ కు భద్రత లేకుండా పోతుందని విమర్శలు వస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులకు సంబంధించిన సోషల్ మాధ్యమాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత సెలబ్రెటీలు లబో దిబో అంటూ దానిపై క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది హ్యాకర్ల భారిన పడ్డారు. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సోషల్ మాధ్యమాల వాడకం మరీ ఎక్కువైంది. హ్యాకర్లు ఫేక్ యూఆర్ఎల్ పంపి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఖాతాను హ్యాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇటీవల ప్రముఖుల ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు హ్యక్ అవుతున్న విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్ళు ఎవరినీ వదలడం లేదు. సామాన్యులే కాదు సెలబ్రెటీలను, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుంటున్నారు. సోమవారం(ఆగస్టు 26) ఉదయం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎక్స్ ఖాతాను కేటుగాళ్ళు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిన సమయంలో ఆ ఖాతాలో కొన్ని వీడియోలను, పోస్టులను హ్యాకర్లు పెట్టారు. ఈ విషయం గమనించిన స్పీకర్ వెంటనే టెక్నికల్ టీమ్ సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చింది. ఈ విషయంపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఓ ట్వీట్ చేశారు.
గడ్డం ప్రసాద్ కుమార్ ‘సూచన.. ఈ రోజు ఉదయం నా ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ కొంత సేపు హ్యాక్ అయ్యింది. ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు కొన్ని అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేశారు.. వెంటనే స్పందించిన మా టెక్నికల్ టీమ్ తగు చర్యలు తీసుకొని ఖాతాను రికవరీ చేశారు. హ్యాక్ చేసిన సమయంలో దుండగులు అసభ్యకరమైన పోస్టులు, వీడియోలు పెట్టారు.. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని అన్నారు. టెక్నాలజీ పెరుగుతన్నా కొద్ది సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు గ్యారెంటీ లేదు, సోషల్ మాద్యమాల్లో గోప్యంగా ఉండాల్సిన సమాచారం సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలోనే కేటుగాళ్ళు బాధితులను భయపెట్టడమే కాదు, డబ్బులు వసూళ్ళు చేస్తున్నారు.
సూచన..
ఈరోజు ఉదయం నా వ్యక్తిగత X (TWITTER) కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయింది. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారు.నా X హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను pic.twitter.com/blgsgfAdjV
— Gaddam Prasad Kumar (@PrasadKumarG999) August 26, 2024