iDreamPost
android-app
ios-app

వ్యభిచారానికి అడ్డాగా మారుతున్న హైదరాబాద్.. చర్యలు తీసుకుంటున్నప్పటికీ

  • Published Sep 30, 2024 | 3:25 PM Updated Updated Sep 30, 2024 | 3:25 PM

Hyderabad : హైదరాబాద్ మహా నగరం.. పైకి అందంగా హై ఫై కనిపించే నగరం మారుతుంది. కళ్ళకు కనిపించని కామాంధులతో, వ్యభిచార ముఠాలతో నగరం చెడిపోతుంది. పూర్తి స్టోరీ చూసేయండి.

Hyderabad : హైదరాబాద్ మహా నగరం.. పైకి అందంగా హై ఫై కనిపించే నగరం మారుతుంది. కళ్ళకు కనిపించని కామాంధులతో, వ్యభిచార ముఠాలతో నగరం చెడిపోతుంది. పూర్తి స్టోరీ చూసేయండి.

  • Published Sep 30, 2024 | 3:25 PMUpdated Sep 30, 2024 | 3:25 PM
వ్యభిచారానికి అడ్డాగా మారుతున్న హైదరాబాద్.. చర్యలు తీసుకుంటున్నప్పటికీ

హైదరాబాద్ లో హై టెక్ వ్యభిచారం.. మహా నగరంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. నగరంలో నయా దందా.. భాగ్య నగరంలో భారీ సె*క్స్ రాకెట్.. పైకి మసాజ్ సెంటర్ కానీ లోపల మ్యాటర్ వేరే.. హైదరాబాద్ గల్లీలో గలీజ్ దందా.. ఇలా రకరకాల వార్తలు ఇప్పటివరకు ఎన్నో విని ఉంటారు. ఏమైంది ఈ నగరానికి? ఎందుకు ఇలా మారిపోతుంది? ఎటు పోతుంది సమాజం ? అనే ప్రశ్నలు ఎదో ఒక సమయంలో అందరికి తలెత్తే ఉంటాయి. పోలీసులు హెచ్చరిస్తున్నా.. ఎప్పటికప్పుడు ఇలాంటి వారిని పట్టుకుంటున్నా.. తవ్విన కొద్దీ ఇలాంటి బిజినెస్ లు బయటకు వస్తూనే ఉన్నాయి. పైగా ఇవేమి సీక్రెట్ గా కూడా జరగడం లేదు. అందరికి తెలిసేలా అందరు తెలుసుకునేలా పబ్లిక్ గానే జరుగుతున్నాయి. హైదరాబాద్ లో దీనికి ప్రత్యేకించి స్పెషల్ ప్లేస్ కూడా ఉంది. కూకట్‌పల్లి అంటే చాలు అందరికి గుర్తొచ్చేది వ్యభిచారం చేసే వారే. ఇక ఆ ప్లేస్ లో ఇలాంటి వాటిని ఆపేవారే లేరు. సోషల్ మీడియాలో ఆ ఏరియా మీద లెక్క లేనన్ని ట్రోల్ల్స్ , మీమ్స్ చూస్తూనే ఉంటారు.

పైకి సాఫ్ట్ వేర్ టెకీలతో అందంగా హై ఫై గా కనిపించే నగరం మారిపోతుంది. కళ్ళకు కనిపించని కామాంధులతో.. వ్యభిచార ముఠాలతో సిటీ చెడిపోతుంది. సెలూన్లు , స్పా సెంటర్ల ముసుగులో చీకటి యవ్వారాలు నడిపిస్తున్న భాగోతాలు చాలానే బయటపడుతున్నాయి. హైదరాబాద్ లో దాదాపు ఎక్కడ చూసినా మెన్ అండ్ విమెన్ పార్లర్లు కనిపిస్తూనే ఉంటాయి. మంచి రిచ్ లుక్, అద్భుతమైన యాంబియన్స్.. సరదాగా రిలాక్స్ అవ్వొచ్చని లోపలికి వెళ్ళారా ఇక మీ పని అయిపోయినట్లే. ఇటీవల కేపీహెచ్‌బీ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో ఇలా స్పా సెంటర్ల ముసుగులో.. వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఇంకో వైపు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. కొందరు ఏకంగా స్పా సెంటర్‌‌ ముసుగులో వ్యభిచార గృహాన్నే నిర్వహిస్తున్నారు. ఈ దందా చేస్తున్న నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయినా సరే ఇలాంటి వ్యవహారాలు మాత్రం చాటుగా కొనసాగుతూనే ఉన్నాయి. కూపీ లాగితే కుప్పలు తెప్పలుగా బయటకు వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ అంటేనే వ్యభిచారానికి అడ్డాగా మారిపోయింది.

ఇలా స్పా సెంటర్స్ లో మాత్రమే ఈ బిజినెస్ లు చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఇంటర్నేషనల్ రేంజ్ లో వెబ్ సైట్స్ పెట్టి మరీ.. విదేశీ యువతులతో చీకటి వ్యాపారాన్ని నడిపిస్తున్నారు మరికొందరు. ఇక అమ్మాయిలను ఎదో ఒక విధంగా ట్రాప్ చేసి దందాలు చేసే వారి సంఖ్య కోకొల్లలు. అందమైన అమ్మాయిలే ఆ కీలాడీలకి టార్గెట్.. ఉద్యోగాల పేరిట ఎరవేస్తున్నారు.. పెద్ద మొత్తంలో జీతాల పేరిట మోసం చేసి.. వారి దగ్గరకు వచ్చిన వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. చివరికి, ఎవరికి అనుమానం రాకుండా ఫ్యామిలీస్ ఉండే అపార్ట్మెంట్స్ లో కూడా ఈ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా హైదరాబాద్ లో ఈ ఏరియా, ఆ ఏరియా అని లేకుండా అన్ని చోట్ల యధేచ్చగా వ్యభిచారం జరుగుతుంది. పైకి కనిపించేది ముగ్గురు నలుగురైనా.. దాని వెనుక ఉండేది మాత్రం బడా బాబులే. పోలీసులు వీటిపై ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే ఇలాంటి వ్యాపారాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇక వీటికి ఎప్పుడు చెక్ పడుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom