iDreamPost
android-app
ios-app

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో లైన్‌! వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

  • Published Aug 13, 2024 | 3:27 PM Updated Updated Aug 13, 2024 | 3:27 PM

Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గ్ కారిడార్‌లో మెట్రో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అలాగే నగరంలో పలు కొత్త మార్గాల్లో కూడా ఈ మెట్రోను సేవలను రూపొందించానున్నారు. అందులో శంషాబాద్ విమానాశ్రమం మెట్రో కూడా ఒకటి. మరీ దాని ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గ్ కారిడార్‌లో మెట్రో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అలాగే నగరంలో పలు కొత్త మార్గాల్లో కూడా ఈ మెట్రోను సేవలను రూపొందించానున్నారు. అందులో శంషాబాద్ విమానాశ్రమం మెట్రో కూడా ఒకటి. మరీ దాని ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 13, 2024 | 3:27 PMUpdated Aug 13, 2024 | 3:27 PM
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో లైన్‌! వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమస్య నుంచి ప్రయాణీకులకు ఊరట కలిగించేందుకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఈ మెట్రో సేవలు ప్రధాన రవాణాగా మారిపోయింది. పైగా తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా నగరంలో ఏ ప్రాంతానికైనా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఈ క్రమంలోనే.. ఆఫీసులకు, స్కూల్లకు, కాలేజీలకు వెళ్లలసిన వారందరూ ఈ మెట్రో ప్రయాణం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇలా నిత్యం దాదాపుగా 5 లక్షల మంది మెట్రో ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గ్ కారిడార్‌లో మెట్రో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అలాగే నగరంలో పలు కొత్త మార్గాల్లో కూడా ఈ మెట్రోను సేవలను రూపొందించానున్నారు. అందులో శంషాబాద్ విమానాశ్రమం మెట్రో కూడా ఒకటి. మరీ దాని ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం నగరంలో రాయదుర్గం నుంచి నాగోల్‌ వరకు ఓ మెట్రో రైలు మార్గం ఉంది. అయితే ఈ మార్గాన్ని ఇప్పుడు ఎల్బీనగర్- చాంద్రాయణగుట్ట- మైలార్‌దేవ్‌పల్లి- జల్‌పల్లి- పీ7 రోడ్- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెుత్తంగా 33.1 కి.మీ. మేరకు పొడిగించనున్నారు. అయితే ఈ శంషాబాద్ విమానాశ్రమం మెట్రోకు కొన్ని ప్రత్యేకతలు కలిగివున్నాయి. అవేమిటంటే.. ఇప్పటి వరకు నగరంలో మెట్రోలన్నీ కూడా ఆకాశ(ఎలివేటెడ్‌) మార్గాలేనో ఉండేవి. కానీ, ఈ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో మాత్రం ఆకాశమార్గంతో పాటు భూమిపై కొంత, భూగర్భం (టన్నెల్)లో మరికొంత దూరం నిర్మించేలా డీపీఆర్ డిజైన్ చేశారు. అయితే ఇలా భూమిపై పరుగులు పెట్టే మెట్రో అనేది రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమన్హారం. ఇకోపోతే ఈ ప్రాజెక్ట్ డిజైన్ ను పరిశీలిస్తే.. నాగోల్‌ నుంచి లక్ష్మీగూడ వరకు మెుత్తం 21.4 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ (ఆకాశమార్గం) ఉంటుంది.

అలాగే లక్ష్మీగూడ నుంచి పీ7 రోడ్డు  ఎయిర్‌పోర్టు ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కి.మీ దూరం భూ మార్గాన్ని (ఎట్‌ గ్రేడ్‌) అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం తగ్గేందుకు మెట్రోను భూమార్గంలో నిర్మించేందుకు డీపీఆర్ డిజైన్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక సర్కార్ అదేశాల  అనంతరం స్వల్పదూరం ఎట్ గ్రేడ్ మర్గాన్ని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇక ఈ ఎయిర్‌పోర్ట్ ప్రాంగణ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీ దూరం భూగర్భంలో (టన్నెల్) మెట్రో ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. అయితే ఇక్కడ మూడు స్టేషన్లు కార్గో, టెర్మినల్, ఏరోసిటీ నిర్మించడంతో  పాటు  మెట్రో డిపోని కూడా నిర్మించాలని ప్రతిపాదించారు.  ఇకపోతే నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు సగటున ప్రతి 1.5 కి.మీ దూరానికి ఒకటి చొప్పున మొత్తం 22 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో కొన్నింటిని ఫ్యూచర్‌ స్టేషన్లుగా భవిష్యత్తు అవసరాల కోసం మెట్రో అధికారులు ప్రతిపాదించారు. మరీ, నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రత్యేకతలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom