నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు

Nagarjuna Got Stay On N Convention Demolition: నాగార్జునాకు చెందిన ఎన్ కన్వెషన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతను తక్షణమే ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Nagarjuna Got Stay On N Convention Demolition: నాగార్జునాకు చెందిన ఎన్ కన్వెషన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతను తక్షణమే ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మాదాపూర్ లోని అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ కూల్చివేతలను శనివారం ఉదయం హైడ్రా ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలను చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలకు సంబంధించి హీరో నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా ఈ కూల్చివేతలు చేపట్టారంటూ నాగార్జున ఆరోపించారు. అలాగే కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టారన్నారు. ఈ ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జునకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

తనకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. నాగార్జున పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ముందు కూల్చివేతలను తక్షణమే ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికే ఎన్ కన్వెన్షన్ అధికారులు పూర్తిగా కూల్చేశారు అంటున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా నాగార్జున ఈ కూల్చివేతలకు సంబంధించి స్పందించిన విషయం తెలిసిందే. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ఇలా కూల్చివేతలు చేపట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తన ఎన్ కన్వెన్షన్ ఉన్న స్థలం పట్టా భూమి అని స్పష్టం చేశారు.

అలాగే తాను ఒక్క అంగుళాన్ని కూడా ఆక్రమించలేదు అని వ్యాఖ్యానించారు. కూల్చివేతలను స్పష్టమైన సమాచారం లేకుండా గానీ.. చట్ట విరుద్దంగా గానీ చేపట్టారు అని అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. తానే స్యయంగా ఆ ఎన్ కన్వెషన్ ను కూల్చివేసే వాడిని అని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. తుమ్ముడి హడ్డి చెరువులోని మూడున్నర ఎకరాలను ఆక్రమించి ఈ ఎన్ కన్వెషన్ ను నిర్మించారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను నాగార్జున ఖండించారు. తాను ఒక్క అంగుళం కూడా ఆక్రణించలేదని.. ఎన్ కన్వెషన్ ఉన్నది మొత్తం పట్టా భూమి అని స్పష్టం చేశారు.

Show comments