iDreamPost
android-app
ios-app

HYDRA: హైడ్రా దూకుడు.. మణికొండలోని 225 విల్లాలకు నోటీసులు

  • Published Aug 26, 2024 | 12:49 PM Updated Updated Aug 26, 2024 | 2:55 PM

Greater Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్ లో ‘హైడ్రా’ కబ్జాకారుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. అక్రమ కట్టడాల విషయంలో ఉక్కపాదం మోపుతుంది. చెరువుల, నాలాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రక్షాళన కార్యక్రాలు చేబడుతుంది.

Greater Hyderabad: ప్రస్తుతం హైదరాబాద్ లో ‘హైడ్రా’ కబ్జాకారుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. అక్రమ కట్టడాల విషయంలో ఉక్కపాదం మోపుతుంది. చెరువుల, నాలాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రక్షాళన కార్యక్రాలు చేబడుతుంది.

HYDRA: హైడ్రా దూకుడు.. మణికొండలోని 225 విల్లాలకు నోటీసులు

అంగ బలం, అర్థ బలం ఉంటే ఏదైనా తమ సొంతం చేసుకోవచ్చు అనుకునే వారు చాలా మంది ఉన్నారు. దేశంలో ఎంతో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి.  కొంత కాలంగా హైదరాబాద్‌లో భూములకు రెక్కలొచ్చాయి.  ఒకదశలో సామాన్యులు భూమి కొనే పరిస్థితిలో లేకుండా పోయింద అంటున్నారు.  కొంతమంది బడాబాబులు మాత్రం ఎక్కడ ఖాళీ స్థలం, చెరువులు,నాలాలు, కుంటలు కనిపిస్తే అక్కడ కబ్జాలు చేసి నిర్మాణాలు చేబడుతున్నారు. అలా అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసే పనిలో ఉంది హైడ్రా. దీంతో అక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.  తాజాగా చిత్రపురి కాలనీలో విల్లాలకు నోటీసులు పంపించారు అధికారులు.  వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో అక్రమదారుల వెన్నుల్లో వణుకు పుట్టిస్తుంది హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్). గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను బుల్డోజ్ చేసే పనిలో ఉంది హైడ్రా (HYDRA). పాత, కొత్త అనే తేడా లేకుండా ధనిక, సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ఏ ఒక్కరినీ వదలకుండా కబ్జాలకు పాల్పపడితే కూల్చుడే అంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో భూ అక్రమణలకు పాల్పపడిన వారి భరతం పట్టే పనిలో ఉంది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ‘హైడ్రా’ ప్రత్యేక అధికారాలు ఇస్తూ ప్రోత్సహించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మనికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో అక్రమంగా నిర్మించిన 225 విల్లాలకు (రో హౌజ్) మున్సిపల్ కమీషనర్ ప్రదీప్ కుమార్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

గత ప్రభుత్వం హయాంలో గొంగచాటుగా అనుమతులు పొందారని.. వాస్తవానికి జీ ప్లస్1 అనుమతి పొంది.. అక్రమంగా జీ ప్లస్2 నిర్మాణాలు చేపట్టారని, 15 రోజుల్లో నోటీసులకు వివరణా ఇవ్వాలని కమీషనర్ పేర్కొన్నారు. వివరణ ఇవ్వడం జాప్యం జరిగినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూల్చివేతలు తప్పవని నోటీసులో హెచ్చరించారు. గత పాలక వర్గంలో తప్పుడు నిర్ణయాల వల్ల చిత్రపురి సొసైటీకి రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. కొంత కాలంగా చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ ఫిర్యాదులు రావడంతో మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.  ఇప్పటికే మాదాపూర్ లో ఎన్ కన్వేన్షన్ సెంటర్ ని కూల్చి వేసిన విషయం తెలిసిందే.