iDreamPost
android-app
ios-app

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించిన ‘iDream క్రైమ్‌ డైరీస్‌’ వెనుకున్న అసలు స్టోరీ!

  • Published Sep 23, 2024 | 3:46 PM Updated Updated Sep 23, 2024 | 3:46 PM

IDream, Crime Diaries with Muralidhar, Chinna Vasudeva Reddy: 500 ఎపిసోడ్స్‌తో ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన ఐడ్రీమ్‌ ‘క్రైమ్‌ డైరీస్‌ విత్‌ మురళీధర్‌’ షో గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

IDream, Crime Diaries with Muralidhar, Chinna Vasudeva Reddy: 500 ఎపిసోడ్స్‌తో ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన ఐడ్రీమ్‌ ‘క్రైమ్‌ డైరీస్‌ విత్‌ మురళీధర్‌’ షో గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Sep 23, 2024 | 3:46 PMUpdated Sep 23, 2024 | 3:46 PM
ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించిన ‘iDream క్రైమ్‌ డైరీస్‌’ వెనుకున్న అసలు స్టోరీ!

‘ఇంటర్వ్యూలంటే.. సినిమా వాళ్లనో, సెలబ్రెటీలనో చేయాలి కానీ.. పోలీస్‌ వాళ్లను ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు సార్‌?’.. ఐడ్రీమ్‌ క్రైమ్‌ డైరీస్‌ పేరుతో ఒక కొత్త షోకు శ్రీకారం చుడదామని ఐడ్రీమ్‌ మీడియా అధినేత చిన్న వాసుదేవ రెడ్డి చెప్పినప్పుడు మురళీధర్‌ చెప్పిన మట ఇది. కానీ.. లెక్కేసి కొడితే 7 ఏళ్ల తర్వాత అదే ‘క్రైమ్‌ డైరీస్‌’ షోకు సోషల్‌ మీడియాలో లక్షలు, కోట్లలో వ్యూస్‌తో పాటు.. ఏకంగా ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 500 మంది పోలీస్‌ ఆఫీసర్లను ఇంటర్వ్యూ చేసి.. జర్నలిస్ట్‌ మురళీధర్‌ ఈ ఘనత సాధించారు. తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్‌ రెడ్డి చేతుల మీదుగా ఆ రికార్డుకు సంబంధించిన పత్రాన్ని ఐడ్రీమ్‌ అధినేత చిన్న వాసుదేవ రెడ్డితో కలిసి మురళీధర్‌ అందుకున్నారు. కానీ, ఈ క్రైమ్‌ డైరీస్‌ ఇంత భారీ సక్సెస్‌ సాధిస్తుందని.. ఆరంభంలో మురళీధర్‌ నమ్మలేదు. కానీ, ఆయనను వెన్నుతట్టి ప్రొత్సహించిన వ్యక్తి ఒకరున్నారు.. పోలీస్‌ వాళ్ల ఇంటర్వ్యూలు ఎవరు చూస్తారు? రెవెన్యూ వస్తుందా? అనే అనుమానాలను పటాపంచలు చేసిన క్రైమ్‌ డైరీస్‌ సృష్టికర్త గురించి, ఆ షో వెనుకున్న పూర్తి స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పోలీస్‌ ఆఫీసర్స్‌ను ఇంటర్వ్యూ చేస్తూ.. వాళ్ల సేవను, డ్యూటీలోని కష్టనష్టాలు, వాళ్లు చూసే క్రైమ్స్‌, క్రిమినల్స్‌, సిస్టమ్‌ ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ప్రొజెక్ట్‌ చేస్తూ.. 2017లో ఐడ్రీమ్‌లో క్రైమ్‌ డైరీస్‌ అనే కొత్త షోను చేయాలని చిన్న వాసుదేవ రెడ్డి ప్లాన్‌ చేశారు. ఇదే విషయాన్ని మురళీధర్‌తో చెబితే.. ‘సార్‌.. పోలీస్‌ వాళ్లను ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు? పైగా రెవెన్యూ కూడా రాదు సార్‌’ అని అన్నారు. కానీ, ఆ కాన్సెప్ట్‌పై ఎంతో నమ్మకమున్న వాసుదేవ రెడ్డి.. ‘లేదు లేదు.. కచ్చితంగా చూస్తారు. మీరు రెవెన్యూ విషయం మర్చిపోండి.. ముందైతే పోలీస్‌ ఆఫీసర్ల ఇంటర్వ్యూస్‌ మొదలుపెట్టండి’ అని ఆదేశించారు. ఏకంగా సంస్థ అధినేత అంత నమ్మకంగా చెబుతుంటే.. మురళీధర్‌లో కూడా ఆ కాన్సెప్ట్‌పై ఆశలు చిగురించాయి.

క్రైమ్‌ డైరీస్‌ పేరుతో కొంతమంది పోలీస్‌ ఆఫీసర్లను ఇంటర్వ్యూ చేశారు. కానీ, పెద్దగా రీచ్‌ లేదు. మళ్లీ మురళీధర్‌లో నిరాశ. అరా కొరా వ్యూస్‌, రెవెన్యూ అస్సలే లేదు. కానీ, చిన్న వాసుదేవ రెడ్డి మాత్రం.. మరోసారి మురళీధర్‌లో ఎనర్జీ నింపారు. ‘మీరు రెవెన్యూ విషయం మర్చిపోండి.. ఇలాగే ఇంటర్వ్యూలు చేస్తూ ముందుకు సాగి పోండి.. గో హెడ్‌’ అంటూ ఎంకరేజ్‌ చేశారు. ఇక అక్కడి నుంచి మురళీధర్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఐడ్రీమ్‌ క్రైమ్‌ డైరీస్‌ అప్రతిహతంగా దూసుకెళ్లింది. ఏళ్లు గడుస్తున్న కొద్ది.. లక్షలు, కోట్ల వ్యూస్‌తో ఆ షో సూపర్‌ సక్సెస్‌ అయింది. ఎంతో మంది పోలీస్‌ అధికారులు తాము చూసిన ఎన్నో క్రైమ్స్‌ గురించి వెల్లడించారు. అప్పటి వరకు ఒక క్రైమ్‌ వెనుక, ఒక పోలీస్‌ వెనుక, ఒక నేరస్థుడి వెనుక ఇంత కథ ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. నేరుస్థుల జైలు జీవితం, నక్సలైట్ల ఉద్యమం, అన్నలు అడవిలో పడే బాధలు, వాళ్ల పోరాటం, పోలీసులు కేసును ఛేదించే విధానం, అందులో ఎదురయ్యే సవాళ్లు.. ఇలా అప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు మురళీధర్‌.

సెప్టెంబర్‌ 22న ఐడ్రీమ్‌ క్రైమ్‌ డైరీస్‌ 500వ ఇంటర్వ్యూ పూర్తి చేసుకోవడంతో పాటు.. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించారు. ఇలాంటి రికార్డు ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో మరే జర్నలిస్ట్‌ పేరిట కూడా లేదు. రికార్డులతో పాటు.. ఈ క్రైమ డైరీస్‌ వల్ల సోసైటీకి కూడా చాలా ఉపయోగం జరిగింది. అన్యాయం జరిగినప్పుడో, క్రైమ్‌ చోటు చేసుకున్నప్పుడో.. ఒక కేసు ఎలా.. పోలీస్‌ స్టేషన్‌ నుంచి.. తీర్పు వరకు వెళ్లుందో ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించారు మురళీధర్‌. పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అవ్వడం, పోలీస్‌ల విచారణ, తర్వాత కోర్టులో విచారణ(జ్యూడీషియరీ) ఇలా అన్ని దశలకు సంబంధించి.. ఆయా విభాగాల్లో ఎంతో అనుభవం ఉన్న పోలీసులను, న్యాయవాదులను, న్యాయనిపుణులను ఇంటర్వ్యూస్‌ చేశారు. అలాగే ఉద్యమం పేరుతో అడవి బాట పట్టి.. తమ జీవితాలను పీడిత ప్రజల కోసం త్యాగం చేసే అన్నలను కూడా ఇంటర్వ్యూ చేసి వారి మనోగతాన్ని ఆవిష్కరించారు. అలా 2017లో మొదలైన క్రైమ్‌ డైరీస్‌ ప్రస్థానం.. ఇప్పుడు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించే స్థాయికి ఎదిగింది. మరి ఈ క్రైమ్‌ డైరీస్‌ షోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.