iDreamPost
android-app
ios-app

ఒవైసీ అడ్డా పాతబస్తీలో అడుగుపెట్టిన హైడ్రా! రంగనాథ్‌కు ఇదే అసలైన సవాల్‌!

  • Published Sep 26, 2024 | 4:13 PM Updated Updated Sep 26, 2024 | 4:13 PM

HYDRA Demolitions In Pathabasthi: హైదరాబాద్ లో హైడ్రా అందరిని వణికిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే వస్తున్నాం. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని పాత బస్తీ ప్రాంతంలో ఈ సర్వేని కొనసాగిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

HYDRA Demolitions In Pathabasthi: హైదరాబాద్ లో హైడ్రా అందరిని వణికిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే వస్తున్నాం. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని పాత బస్తీ ప్రాంతంలో ఈ సర్వేని కొనసాగిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 26, 2024 | 4:13 PMUpdated Sep 26, 2024 | 4:13 PM
ఒవైసీ అడ్డా పాతబస్తీలో అడుగుపెట్టిన హైడ్రా! రంగనాథ్‌కు ఇదే అసలైన సవాల్‌!

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలి.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. పెద్ద, పేద అని తేడా లేకుండా.. అది బఫర్ జోన్ కిందకు వస్తుందా లేదా అనేది మాత్రమే దృష్టిలో ఉంచుకుని.. ఈ కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్ల స్పీడ్ కు సామాన్యులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ బుల్డోజర్ వస్తుందా.. ఏ వైపు నుంచి ఏ నోటీసులు వస్తాయా అని.. సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓ వైపు సామాన్యులు కన్నీరు మున్నీరు అవుతూ మీడియాకు తమ గోడును విన్నవించుకుంటున్నారు. అయినా సరే.. మరో వైపు హైడ్రా తన పని తానూ చేసుకుంటూ పోతుంది. అక్రమ ఆక్రమణ అని తెలిసిన వెంటనే ఆ భవనాన్ని క్షణాల్లో నేలమట్టం చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని పాత బస్తీ ప్రాంతంలో ఈ సర్వేని కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ పాత బస్తి ఏరియాలో అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. అత్తాపూర్ లో ఇంటి ఇంటికి కూడా అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. అది చాలా సెన్సిటివ్ ఏరియా కావడంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించారు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తత ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. దీనితో అక్కడి వారంతా కూడా దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియాతో తమ గోడును చెప్పుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. ఇంటి ఇంటికి తిరుగుతూ.. ప్రతి చిన్న డీటెయిల్ ను కూడా అధికారులు క్షుణ్ణంగా సేకరిస్తున్నారు. మరి అక్కడ ఏ క్షణంలో ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకుంటుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటివరకు ఎక్కడ అక్రమ నిర్మాణాలు కనిపిస్తే అక్కడ క్షణాల్లో నేలమట్టం చేసిన హైడ్రా.. ఇక్కడ ఏం చేస్తుందో చూడాలి. రంగనాథ్ కు ఇది అసలైన సవాల్ అని చెప్పి తీరాలి.

ఇప్పటికే హై స్పీడ్ లో దూసుకుపోతున్న హైడ్రాకు మరింత స్పీడ్ పెంచేలా.. రేవంత్ సర్కార్ అదనంగా 169 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. దీనిని బట్టి చూస్తుంటే.. నగరంలో బఫర్ జోన్ కిందకు వచ్చే ఒక్క భవనాన్ని కూడా హైడ్రా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఇక రానున్న రోజుల్లో ఈ హైడ్రా బుల్డోజర్లు ఏ ఏ ప్రాంతాలపై ఫోకస్ చేస్తాయా అని.. ప్రజలంతా టెన్షన్ లో ఉన్నారు. ప్రస్తుతం పాతబస్తీలో మాత్రం పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మరి వారికి ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటును కలిగిస్తుందో చూడాలి. ఈ శని ఆది వారాల్లో మూసి పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చివేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.