మూసీలో కూల్చివేతలపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: రంగనాథ్

HYDRA Ranganath Sensational Decision: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తుంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటిని బుల్డోజర్లతో కూల్చి వేస్తున్నారు హైడ్రా అధికారుల. దీన్ని కొంతమంది సమర్ధిస్తుంటే.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. మూసీలో ఇళ్ల కూల్చివేతపై రగడ కొనసాగుతుంది.

HYDRA Ranganath Sensational Decision: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తుంది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాటిని బుల్డోజర్లతో కూల్చి వేస్తున్నారు హైడ్రా అధికారుల. దీన్ని కొంతమంది సమర్ధిస్తుంటే.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. మూసీలో ఇళ్ల కూల్చివేతపై రగడ కొనసాగుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. నగరంలో వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. అక్రమ నిర్మాణాలే ఇందుకు కారణం అని భావించి ‘హైడ్రా’ వ్యవస్థను స్థాపించారు. చెరువులు, నాలాల వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కి పవర్స్ ఇచ్చింది. అంతే కాదు హైడ్రా చట్టబద్దత కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.హైడ్రా కమీషనర్ గా రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైడ్రా పేరు చెబితే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా కమీషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చి వేతలు కొనసాగుతున్నాయి. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత జరగుతుందని వార్తలు వస్తున్నాయి. హైడ్రా అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నారని మూసీ నిర్వాహసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కొంతమంది కిరోసిన్ పోసుకొని నిరసన వ్యక్తం చేశారు. తాజాగా మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమీషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మూసీలో సర్వేకు, హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు మూసీ లో కూల్చివేతలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటి వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి హైడ్రా నోటీసులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. కొంతమంది రాజకీయ లబ్ది కోసం మూసీలో భారీ ఎత్తున కూల్చి వేతలు జరుగుతున్నాయని మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న కూల్చి వేతలను హైడ్రాకు ఆపాదించడం సరికాదన్నారు రంగనాథ్. మూసీ నది పరివాహక ప్రాంతా వాసులకు హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు.. పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా హైడ్రా చూసుకుంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కచ్చితమైన సూచనలు జారీ చేసిందని రంగనాథ్ తెలిపారు.

ఇక కూకట్‌పల్లి లోని యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పపడిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. యాదవ బస్తీలో హైడ్రా ఎవరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. ఆమె మరణానికి గల కారణాలు కూకట్ పల్లి పోలీసులతో మాట్లాడినట్లు తెలిపారు. ఆమె కూతుళ్లకు రాసి ఇచ్చిన ఇళ్లు కూకట్ పల్లి చెరువుకు సమీపంలో ఉన్నప్పటికీ ఎఫ్ టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్ళు పోతాయన్న భయంతో బుచ్చమ్మన్న ప్రశ్నించగా..తీవ్ర మానస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యకు పాల్పపడిందని అంతేకానీ హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

 

Show comments