HYDRA నెక్స్ట్‌ టార్గెట్‌ హిమాయత్‌నగర్‌.. ఆక్రమణల జాబితాలో ప్రముఖుల ఫాంహౌస్‌లు

HYDRA Next Target: హైడ్రా దూకుడు పెంచిన నేపథ్యంలో.. తరువాతి టార్గెట్‌ ఏ ఏరియా.. ఏ భవనాలను కూల్చనున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

HYDRA Next Target: హైడ్రా దూకుడు పెంచిన నేపథ్యంలో.. తరువాతి టార్గెట్‌ ఏ ఏరియా.. ఏ భవనాలను కూల్చనున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

హైదరాబాద్‌ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి.. చేపట్టిన నిర్మాణాలపై కొరడా ఝుళిపించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైడ్రా అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక గత కొంత కాలంగా ఎక్కడ చూసిన హైడ్రా పేరే మార్మోగిపోతుంది. ఆక్రమార్కుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తోంది. పేదలు, సామాన్యులు, సెలబ్రిటీలు, విపక్ష నేతలు మాత్రమే కాక అధికార పార్టీ నాయకులు ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్‌ ఇంటి కుటుంబ సభ్యులు ఆక్రమణలకు పాల్పడినా సరే.. వదిలే ప్రసక్తే లేదని హైడ్రా తేల్చి చెప్పింది. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ సోదరుడి ఇంటికి కూడా నోటీసులు జారీ చేసి.. తన దృష్టిలో అందరూ సమానమే అని చెప్పకనే చెప్పింది.

ఆక్రమ నిర్మాణం అని హైడ్రా దృష్టికి వస్తే.. చాలు 24 గంటల వ్యవధిలో కూల్చివేస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడమే కాక.. కూల్చివేతలు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో హైడ్రా నెక్స్ట్‌ టార్గెట్‌ చేయబోయే ఏరియా ఏది అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

హైడ్రా వ్యవస్థ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని 13 చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో హైడ్రా తర్వాత టార్గెట్ హిమాయత్ సాగర్ జలాశయంగా తెలుస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లో గుర్తించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను జలమండలి, రెవెన్యూ అధికారులు చేపట్టారు. ఇక మొదటి దశలో కొందరు ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ జలశయం ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కాంగ్రెస్‌ కీలక నేతలతో పాటు.. ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఉన్నాయని.. వాటిల్లో 10 భారీ నిర్మాణాలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేసినట్లు సమాచారం. ఇలా సెలక్ట్‌ చేసిన వాటిల్లో అధిరార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఫాంహౌస్‌తో పాటు మరి కొందరు నేతల ఫామ్‌హౌస్‌ల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారానికి అనగా సెప్టెంబర్‌ 2 నాటికి ఈ కట్టడాలపై నివేదిక పూర్తి చేసి.. కూల్చివేతలకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్‌లోని అడిక్‌మెట్‌ డివిజన్‌ రాంనగర్‌లో నేడు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రాంనగర్‌ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన పలు కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని తేలటంతో నేడు అనగా శుక్రవారం నాడు హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.

Show comments