School Holidays: Hyderabad లోని స్కూళ్లకు మరో 5 రోజులు సెలవులు..?

Hyderabad Collector-School Holidays: నగరంలోని విద్యార్థులకు శుభవార్త.. వారికి మరో ఐదు రోజులు సెలవులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ వివరాలు..

Hyderabad Collector-School Holidays: నగరంలోని విద్యార్థులకు శుభవార్త.. వారికి మరో ఐదు రోజులు సెలవులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లోని విద్యార్థులకు వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న వరలక్ష్మీ వ్రతం కాగా..  17న శనివారం ఒక్కరోజు మాత్రం కొందరికి స్కూళ్లు ఓపెన్ ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టు 18న ఆదివారం, ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి సెలవు ప్రకటించారు. ఆగస్టు 20న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండే. కానీ మంగళవారం రోజున భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. దాంతో విద్యార్థులకు వరుసగా 6 రోజులు సెలవులు వచ్చాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని స్కూళ్లకు మరో 5 రోజులు సెలవులు రానున్నాయి అని తెలుస్తోంది. ఆ వివరాలు..

తెలంగాణలో గత రెండు మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు మొదలైన వర్షం మంగళవారం ఉదయానికి తీవ్ర రూపం దాల్చింది. తెల్లవారుజాము నుంచే నగరంలో కుండపోత వాన కురిసింది.  ఆ ఒక​రోజే భాగ్య నగరంలో ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.  భారీ వర్షంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం పూట స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం.. మంగళవారం నాడు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

ఇదిలా ఉండగా.. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లోనూ మరోసారి కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీంతో హైదరాబాద్ అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా వర్షం కురిస్తే ముందస్తు సెలవులు ఇవ్వాలని హైదరాబాద్‌ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి మాట్లాడుతూ.. రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల ప్రభావంపై కలెక్టరేట్‌లో రెవెన్యూ, విద్య, వైద్య, అగ్ని, పోలీసు శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు స్కూళ్లకు ముందస్తు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఇప్పటికే గత వారం రోజుల్లో ఒక రోజు మాత్రమే స్కూళ్లు నడిచాయి. ఇక కలెక్టర్‌ ఆదేశాలతో మరో ఐదు రోజులు సెలవులు ఇస్తే.. ఈ నెలలో స్కూళ్లు నడిచిన రోజులు చాలా తక్కువ అని చెప్పవచ్చు. దీని వల్ల సిలబస్‌ కవర్‌ కాక విద్యార్థులతో పాటు టీచర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Show comments