Hyderabad విద్యార్థులకు అలర్ట్.. నేడు స్కూళ్లకు సెలవు.. కారణమిదే!

Heavy Rains-School Holiday: హైదరాబాద్ నగరంలోని విద్యార్థులకు కీలక అలర్ట్.. నేడు పాఠశాలలకు సెలవు. ఆ వివరాలు..

Heavy Rains-School Holiday: హైదరాబాద్ నగరంలోని విద్యార్థులకు కీలక అలర్ట్.. నేడు పాఠశాలలకు సెలవు. ఆ వివరాలు..

హైదరాబాద్ లోని పాఠశాల విద్యార్థులకు కీలక అలర్ట్. నేడు అనగా ఆగస్టు 20, మంగళవారం నాడు సెలవు ప్రకటిస్తూ.. అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం.. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం. సోమవారం సాయంత్రం నుంచే హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. కొన్నిచోట్ల మాత్రం ముసురుపట్టినట్లుగా ఆగకుండ సన్న జల్లు పడుతోంది. ఇక మంగళవారం తెల్లవారుజామున  నుంచి వాన దంచి కొడుతుంది. దాంతో రోడ్లపై వరద నీరు పారుతోంది. పైగా నేడు మధ్యాహ్నం నుంచి భారీ వర్షం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ప్రభుత్వం నేడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.

నేడు జోరు వాన కురుస్తుండటంతో.. జీహెచ్ఎంసీ అధికారులు, తెలంగాణ విద్యాశాఖ పరిస్థితిపై సమీక్షించి.. ఈ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఇవాళ అనగా మంగళవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స్కూళ్లకూ సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల ఇవాళ గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఉన్నట్లే.

ప్రభుత్వమే స్వయంగా సెలవు ప్రకటించడంతో.. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు నేడు సెలవు అనే సమాచారాన్ని చేరవేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. లేదంటే ఈ జోరు వానలో పిల్లల్ని బడికి పంపడం అంటే మాములు విషయం కాదు.

ఇక హైదరాబాద్‌లో ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం 5 గంటల సమయంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం మొదలై దాదాపు గంటపాటూ కురిసింది. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో తగ్గినా ముసురు వాన ఉదయం 8.30 వరకూ కొనసాగింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాన తగ్గి.. సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఐతే.. మధ్యాహ్నం తర్వాత మళ్లీ వాన మొదలై.. సాయంత్రానికి భారీ వర్షాలు కురవవచ్చనే అంచనాలు ఉన్నాయి.

మరి జిల్లాల పరిస్థితి ఏంటి..

ప్రస్తుతం నగరంలోనే కాక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా.. ఉత్తర తెలంగాణలో బాగా కురుస్తున్నాయి. అందువల్ల జిల్లాల్లో అక్కడున్న పరిస్థితులను బట్టీ.. స్కూళ్ల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాలని డీఈఓ, ఎంఈఓలకు స్కూళ్ల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి బట్టి అక్కడ కూడా సెలవు మంజూరు చేసే అవకాశం ఉంది.

Show comments