iDreamPost
android-app
ios-app

18 చోట్ల కూల్చివేతలు చేసిన HYDRA.. ఎన్ని ఎకరాల భూమి స్వాధీనం చేసుకుందంటే?

HYDRA Report To Government: హైడ్రా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేసిన కూల్చివేతలు, స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించి హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

HYDRA Report To Government: హైడ్రా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేసిన కూల్చివేతలు, స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించి హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

18 చోట్ల కూల్చివేతలు చేసిన HYDRA.. ఎన్ని ఎకరాల భూమి స్వాధీనం చేసుకుందంటే?

విచ్చలవిడిగా చెరువులు, నాలాలను ఆక్రమించి చేసిన కట్టడాలకు హైడ్రా బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏకంగా 18 చోట్ల కూల్చివేతలు నిర్వహించారు. అంతేకాకుండా.. ఆ భూమిని కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంది. చెరువులు, నాలాలను తిరిగి స్వాధీనం చేసుకుని.. అక్రమ కట్టడాలను తొలగించడమే లక్ష్యంగా ఈ కూల్చివేతలు సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు హైడ్రా నిర్వహించిన ఈ కూల్చివేతలకు సంబంధించి ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఆ నివేదికలో ఎక్కడెక్కడ కూల్చివేతలు చేశారు? ఎన్ని ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అనే విషయాలను ప్రభుత్వానికి వివరించారు.

ఇప్పటివరకు హైడ్రా కూల్చేసిన కట్టడాలకు సంబంధించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మొత్తం ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిగినట్లు వెల్లడించారు. ఈ కూల్చివేతల ద్వారా ఏకంగా 48.94 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం అంటూ వివరించారు. వీటిలో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా ప్రో కబడ్డీ యజమాని అనుపమ భవనం, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి, చింతల్ లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడు, కావేరీ సీడ్స్ ఓనర్ భాస్కరరావు, నందగిరిహిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడుకి చెందిన భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ కూల్చివేతల ద్వారా 48.94 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.

మరిన్ని ప్రాంతాలకు హైడ్రా:

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైడ్రాకి సంబంధించి వ్యాఖ్యలు చేయడం  చూశాం. అక్రమ కట్టడాలు ఎవరికి చెందినవి అయినా కూల్చే తీరుతాం అని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉన్న వారికి చెందిన కట్టడాలు అయినా కూడా కూల్చేయడమే అంటూ ప్రకటించారు. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు రాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం చాలా మంచి పని చేస్తోంది అంటూ కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైడ్రా తరహా వ్యవస్థలను ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోందట. కొత్తగా కబ్జాలు జరగకుండా ఆపడం, ఉన్న ఆక్రమణలను తొలగించడం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇతర నగరాల్లోని పరిస్థితిపై సమీక్ష కూడా నిర్వహించానరి తెలుస్తోంది. త్వరలోనే హైడ్రా తరహా యాక్షన్స్ ఇతర నగరాల్లో చూసేందుకు ఆస్కారం లేకపోలేదు. మరికొన్నిరోజుల్లో ఇందుకు సంబంధించి ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరి.. హైడ్రా 48.94 ఎకరాలను స్వాధీనం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.