మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ భారం ఉండదు!

Nagole Metro Station: నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో వాహనాలు పార్కింగ్ చేస్తే ఫీజు వసూళ్లు చేస్తామని ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తన వ్యతిరేకత రావడంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Nagole Metro Station: నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో వాహనాలు పార్కింగ్ చేస్తే ఫీజు వసూళ్లు చేస్తామని ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తన వ్యతిరేకత రావడంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

గత కొంత కాలంగా హైదరాబాద్‌లో వలసల పర్వం కొనసాగుతుంది.. వివిధ రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం ఎంతోమంది వలస కూలీలు వస్తున్నారు. దీంతో నగరంలో రద్దీ బాగా పెరిగిపోయింది. రోడ్డుపైకి వస్తే ట్రాఫిక్ జామ్, పొల్యూషన్, శబ్ధ కాలుష్యం ఇలా ఎన్నో రకాల బాధలు పడాల్సి వస్తుంది. వీటిని అరికట్టడానికి హైదరాబాద్‌లో 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. నాగోల్ నుంచి అమీర్ పేట్, మియాపూర్ మార్గంలో మెట్రో రైలు ప్రారంభించారు. అప్పటి నుంచి నుంచి దీన్ని పునరుద్దీకరిస్తూ వచ్చారు. ప్రస్తుతం నగరంలో చాలా మంది మెట్రో ప్రయాణం చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. తాజాగా ప్రయాణికులకు మెట్రో సంస్థ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయడంపై మెట్రో అధికారుల మరోసారి వెనక్కి తగ్గారు. ఆగస్ట్ 25, సెప్టెంబర్ 1 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేస్తే ఫీజు చెల్లించాలని మెట్రో అధికారులు ప్రకటించారు. దీంతో మెట్రో టికెట్ కన్నా పార్కింగ్ ఫీజు ఎక్కువ అవుతుందని ప్రయాణికులు ఆందోళన మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం కలిపించాలని కోరుతూ రేపు నాగోల్ లో ప్రయాణికులు పెద్ద ఎత్తున ధర్నా చేయానున్నారు.. ఈ విషయం పరిగణలోకి తీసుకొని పెయిడ్ పార్కింగ్ విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం.

మెట్రో స్టేషన్ లో చెల్లింపు పార్కింగ్ ప్రారంభాన్ని తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా వేస్తున్నట్లు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు. పెయిడ్ పార్కింగ్ పై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రయాణికుల సమస్యలను మరింత మెరగా పరిష్కరించేందుకు, వారిపై అదనపు భారం పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. పార్కింగ్ ఫీజు వసూళ్లు చేస్తే మధ్య తరగతి కుటుంబీకులపై పెను భారం పడుతుందని మెట్రో నిర్ణయాన్ని వ్యతిరేకించారు ప్రజలు.

Show comments