GHMC New Rules To Feed Stray Dogs: వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారా.. GHMC కొత్త రూల్స్‌ తెలుసుకోకపోతే కష్టం..

వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారా.. GHMC కొత్త రూల్స్‌ తెలుసుకోకపోతే కష్టం..

GHMC New Rules To Feed Stray Dogs: వీధి కుక్కలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ఇకపై వాటికి ఆహారం పెట్టాలంటే.. కొన్ని రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే. ఆ వివరాలు..

GHMC New Rules To Feed Stray Dogs: వీధి కుక్కలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ఇకపై వాటికి ఆహారం పెట్టాలంటే.. కొన్ని రూల్స్‌ ఫాలో అవ్వాల్సిందే. ఆ వివరాలు..

ఒక్క భాగ్యనగరంలోనే కాక.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని వేధిస్తోన్న సమస్య.. వీధి కుక్కలు. ఈమధ్య కాలంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడటమే కాక.. మృతి చెందిన చిన్నారులకు సంబంధించిన వార్తలు అనేకం వెలుగులోకి వస్తోన్నాయి. ఇక హైదరాబాద్‌లో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పిల్లలనే కాదు కనీసం పెద్దలు కూడా ఒంటరిగా రోడ్డు మీద వెళ్లాలన్నా వీధి కుక్కల కారణంగా భయపడాల్సిన పరిస్థితి. ఉన్నట్లుండి ఒక్కసారిగా మీదకు వచ్చి దాడి చేస్తున్నాయి. ఇక నగరంలో ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో.. దీనిపై ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించాయి. సమస్య పరిష్కారం కోసం.. కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వీధికుక్కలకు సంబంధించి తాజాగా జీహెచ్‌ఎంసీ కొత్త రూల్స్‌ పెట్టింది. వీటిని పాటించకపోతే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరి ఆ రూల్స్‌ ఏంటో మీరు కూడా తెలుసుకోండి.

హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య రోజురోజుకూ తీవ్రం అవుతోంది. దీనిపై తెలంగాణ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీకి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జీహెచ్ఎంసీ వీధి కుక్కలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటికి ఆహారం పెట్టేవారికి షాక్ ఇచ్చింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ నగర పరిధిలో వీధి కుక్కలకు ఫుడ్ అందించేవారికి జీహెచ్ఎంసీ తాజాగా షాక్ ఇచ్చింది. ఇక నుంచి వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టడం కుదరదని తేల్చి చెప్పింది. వాటికి ఫుడ్‌ పెట్టాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా కూడా.. ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు.. అధికారులు కొన్ని ప్రాంతాలను కేటాయిస్తారని తెలిపింది. అధికారులు కేటాయించిన స్థలాల్లో మాత్రమే వీధి కుక్కలకు ఆహారం అందించాలని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

వీధి కుక్కలకు ఆహారం అందించే వాలంటీర్లు, స్వచ్చంద సంస్థలు, నగర వాసులు ఎవరైనా సరే.. తప్పనిసరిగా జీహెచ్ఎంసీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ. ఇళ్లు, పాఠశాలలు, ప్లే గ్రౌండ్స్‌కు దూరంగా.. వీధి కుక్కలకు ఆహారం అందించడానికి ప్రత్యేక ప్రదేశాలను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక వారు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే వీధి కుక్కలకు ఆహారం అందించాలని ఆ ఉత్తర్వుల్లో జీహెచ్ఎంసీ పేర్కొంది. తాజాగా ఇచ్చిన ఆదేశాలతో అయినా.. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల స్వైర విహారం, కుక్క కాటు ఘటనలు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Show comments