iDreamPost
android-app
ios-app

Hydలో మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

  • Published Oct 28, 2024 | 3:44 PM Updated Updated Oct 28, 2024 | 3:44 PM

Hyderabad: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు వరుసగా కన్నుమూయడంతో వారిని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.

Hyderabad: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు వరుసగా కన్నుమూయడంతో వారిని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.

Hydలో మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

ఇటీవల హైదరాబాద్ లో కలుషిత ఆహారం తిని పలువురు చనిపోవడం, తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలు కావడం చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎన్నో రకాల స్ట్రీట్ ఫుడ్ లభిస్తాయి. పానీపూరి, కబాబ్స్, షావర్మా, బర్గర్లు, బజ్జీలు, మోమోస్ ఇలా టేస్ట్ చేయడానికి ఎన్నోరకాల పదార్ధాలు అమ్ముతుంటారు. ముఖ్యంగా బయట ఫుడ్ అనగానే గుర్తుకు వచ్చేవి పానీపూరి, షావర్మ, మోమోస్. ఇవి ఎక్కడ కనిపించినా లొట్టలేసుకుంటూ మరీ లాటించేస్తుంటారు. బయట ఫుడ్ తింటే ప్రమాదం అని ఎంత చెప్పినా పెద్దగా పట్టించుకోరు. బయట ఫుడ్ తయారీ విషయంలో పరిశుభ్రత పాటించకపోవం వల్ల ఎంతోమంది ఆస్పత్రిపాలవుతున్నారు. ఈ మధ్యనే అల్వాల్‌లోని లోతుకుంటలోని గ్రిల్‌హౌస్‌లో షావర్మా తిని నలుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది.  మోమోస్ తిని ఓ మహిళ చనిపోగా.. 20 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని నందినగర్ లో చోటు చేసుకుంది. నంది‌నగర్ లో వారాంతపు సంతలో పెట్టిన మోమోస్ ను బాధితురాలి తిన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో సదరు మహిళ చనిపోగా మరో 20 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని దగ్గరలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వారాంతపు సంతలో మోమోస్ పెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. బంజారాహిల్స్ పరిధిలో జరిగే వారాంతపు సంతలో మోమోస్ విక్రయించారని స్థానికులు అంటున్నారు. సింగాడికుంట, నందినగర్, వెంకటేశ్వర కాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో మోమోస్ బాధితులు ఉన్నట్లు తెలిసింది. సింగాడికుంటకు రేష్మా అనే మహిళ  గత వారం మోమోస్  తిని తీవ్ర అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే మోమోస్ షాప్ నిర్వహించిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. మోమోస్ ని మైదా పిండితో తయారు చేస్తారు. ఇది అంత త్వరాగా జీర్ణమయ్యే పదార్థం కాదని అంటారు. మోమోస్ అధిక మొత్తంలో తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. మోమోస్ లో అధిక మొత్తంలో కార్బోహైడ్రైట్లు కలిగి ఉంటాయి. మోమోస్ రెగ్యూలర్ గా తింటే అధిక బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. అంతేకాదు మలబద్దకంతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు అంటున్నారు వైద్యనిపుణులు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లో వరుసగా రైడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బయట లభించే కబాబ్స్, పానీపూరి, షావర్మ, మోమోస్ లాంటి వాటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా, ఈస్ట్ (ఫంగస్ – పులిసిపోయిన ఆహారంపై ఉండే బ్యాక్టీరయా) ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని అధికారులు అంటున్నారు. అందుకే బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ అంత శ్రేష్టమైనది కాదని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అపరిశుభ్రత వాతావరణంలో,కలుషిత పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం ప్రాణాలకు ప్రమాదం అని అంటున్నారు.