మంత్రి పొంగులేటి ఇంట్లో ED సోదాలు.. రంగంలోకి దిగిని 16 టీమ్స్‌!

ED Raids on Minister Ponguleti Srinivas House: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట ఈడీ తనిఖీలు చేస్తుంది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

ED Raids on Minister Ponguleti Srinivas House: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట ఈడీ తనిఖీలు చేస్తుంది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా  డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార వేత్తల ఇండ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు మొదలయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ సోదాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఏక కాలంలో 16 చోట్ల విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే భారీ భద్రత మధ్య హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి ఇంట్ల ఈడీ అధికారలు సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది నవంబర్ లో కూడా ఈడీ ఇలాంటి సోదాలు పొంగులేటి ఇంట నిర్వహించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు జరగ్గా, జూబ్లిహిల్స్ లోని పొంగులేటి కూతురు నివాసంతో పాటు బంధవుల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హిమాయత్ సాగర్ ఫామ్ హౌస్ లో సైతం ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేంగా 16 బృందాలు ఏక కాలంలో సీఆర్‌పీఎఫ్ భద్రత మధ్య పలు చోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం పొంగులేటికి హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రా ఆఫీస్ లు ఉన్నాయి. గత ఏడాది కూడా ఇదే తరహాలో ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే రైడ్స్ కు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Show comments