iDreamPost
android-app
ios-app

సుదర్శన్ థియేటర్‌ వద్ద దేవర కటౌట్‌కు నిప్పు! కారణం ఏంటంటే..?

దేవర మేనియా మొదలైంది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ బొమ్మ కనబడగానే ఈలలు, కేకలతో థియేటర్లు దద్దరిల్లాయి. అయితే రాత్రి నుండే హంగామా మొదలైంది. ఇదిలా ఉంటే RTC క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

దేవర మేనియా మొదలైంది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ బొమ్మ కనబడగానే ఈలలు, కేకలతో థియేటర్లు దద్దరిల్లాయి. అయితే రాత్రి నుండే హంగామా మొదలైంది. ఇదిలా ఉంటే RTC క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

సుదర్శన్ థియేటర్‌ వద్ద దేవర కటౌట్‌కు నిప్పు! కారణం ఏంటంటే..?

తారక్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు నేటితో తెరపడింది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర మూవీ విడుదలయ్యింది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ హీరోగా వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ విపరీతమైన ఎక్స్‌పర్టేషన్స్ పెట్టుకున్నారు. అందులోనూ చాలా రోజుల తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్‌ను డ్యూయల్ రోల్‌లో చూడబోతున్నామన్న ఎగ్జైంటిలో ఉన్నారు. తొలి షో నుండి సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఇక థియేటర్ల దగ్గర నానా హంగామా చేస్తున్నారు అభిమానులు. పెద్ద పెద్ద కటౌట్స్ కట్టి.. హోర్డింగులు పెట్టి తమ అభిమానాన్ని చాటుతున్నారు. థియటేర్లన్నీ జాతర్లను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్ దగ్గర  దేవర కటౌట్‌కు నిప్పంటుకుంది.

థియేటర్ ఆవరణలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కటౌట్‌కు మంటల్లో కాలిపోయింది. మంటలు ఎగసి పడటంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉంటే.. ఇది దుండగుల పని అని తెలుస్తోంది. అలాగే టపాసులు కాల్చుతుండగా.. ప్రమాదవశాత్తూ కటౌట్‌కు నిప్పు అంటుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దేవర కటౌట్ మంటల్లో కాలిపోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఓర్వలేక.. ఈ చర్యకు దిగారంటూ మండిపడుతున్నారు.  అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న చిత్రం కావడంతో కాస్తంత ఆందోళన ఉన్నప్పటికీ.. గతంలో ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన జనతా గ్యారేజ్ హిట్ కొట్టడంతో సినిమాపై హైప్, హోప్ డబుల్ అయ్యింది. ఇక ఒకప్పటికి అందాల సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తొలి సారిగా తెలుగులోకి అడుగుపెట్టడంతో మరోసారి సీనియర్ ఎన్టీఆర్- శ్రీదేవి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆనందంలో మునిగిపోతున్నారు.  రూ. 300 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది.  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ చేశాడు. వీరితో పాటు శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్,  శృతి మరారే, తాళ్లూరి రాజేశ్వరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.  అనిరుధ్ తన మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడని నడుస్తుంది. థియేటర్లలో పూనకాలు తెచ్చేసుకుంటారు ఫ్యాన్స్. బాక్సాఫీసు కా బాప్ వచ్చాడంటూ సంబరంలో మునిగి తేలిపోతున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. దేవర సినిమా చూసినట్లయితే.. ఎలా ఉందో మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.