Hyderabadలో డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌.. ఇవి పాటించకపోతే ప్రమాదమే

Dengue Cases-Hyderabad: నగరంలో డెంగ్యూ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

Dengue Cases-Hyderabad: నగరంలో డెంగ్యూ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాలు..

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం అని పేరుంది. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయి. మరీ ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి వ్యాధులు వానాకాలంలోనే ఎక్కువగా దాడి చేస్తుంటాయి. ఇక వీటితో పాటు దగ్గు, జలుబు, వైరల్‌ ఫీవర్‌ వంటి వంటి వ్యాధులు కూడా దాడి చేస్తాయి. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న వారు వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే హైదరాబాద్‌లో డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుంది. ప్రస్తుతం భాగ్యనగరంలో డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. డెంగ్యూతో బాధపడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో.. చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూ బారిన పడ్డ వారిలో ప్లేట్‌లెట్స్‌ పడిపోతుండటంతో.. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక ఇప్పటికే హైదరాబాద్‌లో 600లకు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

డెంగ్యూ బారిన పడితే.. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. డెంగ్యూ వస్తే.. తెల్ల రక్తకణాల కౌంట్ తగ్గిపోయి ప్రాణాల మీదకు వస్తుంది. ప్రస్తుతం నగరంలో జర్వాలతో పది మంది ఆస్పత్రుల్లో చేరితో.. వారిలో ముగ్గురు లేదా నలుగురు డెంగ్యూ బాధితులే ఉంటున్నారని అధికారులు తెలిపారు. పైగా వీరిలో వారిలో చాలా మందిలో కాలేయ, కిడ్నీలపై ప్రభావం పడినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాక ప్రస్తుతం నగరంలో డెంగ్యూతో పాటుగా గన్యా బాధితులు కూడా పెరుగుతున్నారని అధికారులు చెప్పుకొచ్చారు. టైగర్ దోమల కారణంగా డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • టైగర్‌ దోమ కుట్టిన 4-5 రోజులకు డెంగ్యూ ఫీవర్ లక్షణాలు కనిపిస్తాయి.
  • 102 డిగ్రీల జ్వరం, కళ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి, ఒంటి నొప్పులు, ఒంటిపై ఎర్రటి దద్దర్లు ఉంటే డెంగ్యూ జ్వరంగా అనుమానించాలి.
  • వైరల్‌ ఫీవర్‌ వల్ల కూడా తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి డెంగ్యూ తరహా లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి.
  • మూడు రోజుల తర్వాత కూడా ఈ లక్షణాలు తగ్గకపోతే.. ఆస్పత్రికి వెళ్లాలి.
  • డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే ఎన్‌ ఎస్‌ 1 యాంటిజెన్‌ టెస్ట్ చేయించాలి.
  • వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించాలి.
  • జ్వరం వచ్చి 5 రోజులు దాటితే డెంగ్యూ నిర్ధారణకు ఐజీఎం యాంటీబాడీస్‌ టెస్ట్‌ చేయించా​ల్సి ఉంటుంది.
  • డెంగ్యూని సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది.
  • అప్రమత్తంగా ఉంటూ ప్లేట్‌లెట్లు, బీపీ తగ్గకుండా చూసుకోవాలి.
  • జ్వరం తగ్గినా జాగ్రత్తగా ఉండి ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగేలా చూసుకోవాలి.
  • కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • దోమలు కుట్టకుండా జాగ్రత్తపడాలి.
Show comments