జాగ్రత్త.. ఆ పని చేస్తే ఇక లైసెన్సులు రద్దే..!

్టీHyderabad Traffic Police: ఇటీవల రోడ్డుపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి..ఎంతోమంది అమాకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

్టీHyderabad Traffic Police: ఇటీవల రోడ్డుపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి..ఎంతోమంది అమాకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, నిద్రలేమి, అవగాహన లేమి, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని రకాల నిబంధనలు పెట్టినా వాటిని లెక్క చేయడం లేదని అంటున్నారు. ప్రధాన రహదారులు, కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్, రాంగ్ సైడ్, త్రిపుల్ రైడింగ్ చేసేవారికి జరిమానాలు విధిస్తున్నారు. కానీ కొంతమంది వాహనదారుల తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

వాహనదారులు బహుపరాక్.. ఇక నుంచి రాంగ్ డ్రైవ్ చేసేవారికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకుండా రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం, అతివేగం డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారు ముఖ్యంగా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసేవారి డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దయ్యేల చూస్తామని అన్నారు. ఈ మేరకు రవాణాశాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు, త్వరలో గ్రేటర్ అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ లో వందల సంఖ్యల్లో రాంగ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారి కేసులు పెరిగిపోతున్నాయి. అతి వేగం కారణంగా అమాయకులు మృత్యువాత పడుతున్నారు.. పెద్ద దిక్కు కోల్పోయి కొన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసుల్లో మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దు చేసేవారు.. న్యాయస్థానాలు వారికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు లైసెన్స్ రద్దు చేసేవారు. ఇప్పుడు రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఇలాటి చర్యలే తీసుకోవాలని ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తుంది. మరి వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై రాంగ్ రూట్ లో వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు.

Show comments